Last Updated:

Ponniyin Selvan 2 Movie Review : పొన్నియిన్‌ సెల్వన్‌-2 సినిమా రివ్యూ, రేటింగ్.. ఎలా ఉందంటే ?

Ponniyin Selvan 2 Movie Review : పొన్నియిన్‌ సెల్వన్‌-2 సినిమా రివ్యూ, రేటింగ్.. ఎలా ఉందంటే ?

Cast & Crew

  • విక్రమ్, 'జయం' రవి, కార్తీ (Hero)
  • ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష (Heroine)
  • ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు (Cast)
  • మణిరత్నం (Director)
  • మణిరత్నం, సుభాస్కరన్ (Producer)
  • ఏఆర్ రెహమాన్ (Music)
  • రవి వర్మన్ (Cinematography)
3

Ponniyin Selvan 2 Movie Review : లెజండరీ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ చిత్రం “పొన్నియిన్‌ సెల్వన్‌-1” ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ. 500 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ప్రముఖ తమిళ రచయత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీలో.. చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌ రాయ్‌, త్రిష, వంటి భారీ తారాగణం నటించడం విశేషం. కాగా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “పొన్నియిన్‌ సెల్వన్‌ – 2” సినిమా రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

పీఎస్ – 1 ఎక్కడ అయితే ముగిసిందో అక్కడి నుంచి పీఎస్ 2 కథ మొదలైంది. వల్లవరాయ వందియ దేవుడు (కార్తీ), పొన్నియిన్ సెల్వన్ (జయం రవి).. చోళనాడుకు నౌకపై వెళ్తుండగా వారిపై దాడి జరిగి నీటిలో మునిగిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. రెండో భాగాన్ని ఆదిత్య కరికాలుడు (విక్రమ్), నందిని (ఐశ్వర్యా రాయ్) చిన్ననాటి ప్రేమకథ నుంచి మొదలు పెడతారు. ఆ ఫ్లాష్‌బ్యాక్ తర్వాత నీటిలో మునిగిపోయిన వందియ దేవుడు, పొన్నియిన్ సెల్వన్‌లను పూంగుళి (ఐశ్వర్య లక్ష్మి) కాపాడుతుంది. మరోవైపు ఆదిత్య కరికాలుడు, కుందవై (త్రిష), పొన్నియిన్ సెల్వన్‌లను ఒకేసారి చంపడానికి నందిని.. పాండ్యులతో కలిసి పథకం వేస్తుంది. మరి నందిని పథకం సఫలం అయిందా? చోళనాడుకు చివరికి ఎవరు రాజు అయ్యారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ విశ్లేషణ (Ponniyin Selvan 2 Movie Review)..

ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అనగానే అందరిలో మొదలయ్యే ప్రశ్న ఒక్కటే.. పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా తమిళనాట పెద్ద హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు.  దాంతో ఈ మూవీపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటి భాగంలో స్క్రీన్ మీద ఎక్కువ పాత్రలు, ఒక్కో పాత్రకు మరిన్ని పేర్లు.. పూర్తిగా తమిళ నేటివిటీ.. మిగిలిపోయిన ప్రశ్నలతో ఒక బ్లాంక్ గా మిగిలిపోయింది. అయితే వీటన్నింటినీ దాటుకొని వచ్చిన ఈ రెండో భాగం మొదటి సన్నివేశం నుంచే కథలోకి వెళ్లిపోయారు దర్శకుడు మణిరత్నం. దీనిలో ఆదిత్య కరికాలుడు, నందినిల చిన్ననాటి ప్రేమ కథ స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది. పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడని తన కుటుంబం పడే బాధ, ఇదే అదనుగా రాజ్యం కోసం శత్రువులు పన్నే పన్నాగాలు, మరోవైపు శ్రీలంకలో వందియ దేవుడు, పొన్నియిన్ సెల్వన్ తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల మధ్య ఫస్టాఫ్ చాలా రేసీగా సాగుతుంది.

కానీ సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులకు కొంచెం సహనానికి పరీక్ష పెడుతుంది. కథలోని కీలక పాత్రల మధ్య డ్రామా పండించడానికి మణిరత్నం ప్రయత్నించినా అది ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో విక్రమ్, ఐశ్వర్యా రాయ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. అలాగే నందిని పాత్రకు సంబంధించిన ట్విస్టు ప్రేక్షకులకు నచ్చుతుంది. చివర్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు మాత్రం బాహుబలి రేంజ్ ఆశిస్తే మాత్రం ఫీల్ అవ్వాలి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ మాత్రం ఓకే.. కానీ ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. పాటలు బాగున్నాయి.. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ ఎక్కువ ఉపయోగించారు. మొత్తానికి పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 బాగుంది. తమిళ్ లో అయితే సూపర్ హిట్ అని చెప్పవచ్చు.. మరి తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది  తెలియాల్సి ఉంది.

నటీనటులు ఎలా చేశారంటే..

అందరూ వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. స్టోరీ పరంగా మాత్రం ఆదిత్య కరికాలుడు, నందిని పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. విక్రమ్, ఐశ్వర్యరాయ్ అయితే వారి పాత్రల్లో జీవించేసి  ప్రాణం పోశారు. కానీ ఆ పాత్రలకు ఎమోషన్స్ కు సంబంధించి మరింత ఎమోషన్స్ పండించే సీన్లు ఇంకా ఉంటే బాగుండేది. త్రిష, కార్తీల మధ్య వచ్చే లవ్ సీన్‌లో ఇద్దరూ బాగా నటించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. మొదటి భాగంతో పోలిస్తే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఎక్కువ బాగుంది. పొన్నియిన్ సెల్వన్ 2 నిర్మాణ విలువలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే, బీజీఎం మెప్పిస్తాయి. కల్కి కృష్ణమూర్తి నవలకు తెర రూపం ఇచ్చే క్రమంలో మణిరత్నం ఎక్కడా డైవర్ట్ కాలేదు. ఉన్నది ఉన్నట్లు హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు.

కంక్లూజన్..

తమిళ్ కి బాగుంది.. తెలుగుకి ఓకే

ఇవి కూడా చదవండి: