Last Updated:

Agent Movie Review : అక్కినేని అఖిల్ “ఏజెంట్” సినిమా రివ్యూ, రేటింగ్.. అయ్యగారు హిట్ కొట్టాడా?

Agent Movie Review : అక్కినేని అఖిల్ “ఏజెంట్” సినిమా రివ్యూ, రేటింగ్.. అయ్యగారు హిట్ కొట్టాడా?

Cast & Crew

  • అఖిల్ అక్కినేని (Hero)
  • సాక్షి వైద్య (Heroine)
  • మమ్ముట్టి, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, భరత్ రెడ్డి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు (Cast)
  • సురేందర్ రెడ్డి (Director)
  • రామబ్రహ్మాం సుంకర (Producer)
  • హిప్ హాప్ తమిళ, భీమ్స్ (వైల్డ్ సాలా సాంగ్) (Music)
  • రసూల్ ఎల్లోర్ (Cinematography)
2.5

Agent Movie Review : అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 9 ఏళ్లు అవుతున్నా.. అతడికి సరైన మాసివ్ హిట్ పడలేదనే చెప్పాలి. 2021లో పూజా హెగ్డేతో కలిసి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అతడి స్టార్ డమ్‌ను మాత్రం పెంచలేదనే చెప్పాలి. దాంతో సురేందర రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో మాసివ్ హిట్ కొట్టాలని ఎంతో ఆశగా ఉన్నాడు అఖిల్. ఈ మేరకు ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..        

సినిమా కథ..

రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్ అక్కినేని)కి ‘రా’ ఏజెంట్ అవ్వాలని కోరిక. ఇంట్లో చెప్పకుండా మూడుసార్లు ఎగ్జామ్ రాస్తాడు. ఆ మూడుసార్లూ ఇంటర్వ్యూలో రిజక్ట్ అవుతాడు. ‘రా’ (ఇంటిలిజెన్స్)  చీఫ్ మహదేవ్ (ముమ్మట్టి)కు డెవిల్ అని మరో పేరు. ఆయన ఎలాంటి ఎసైన్మెంట్ అయినా ఈజీగా టాకిల్ చేసి సక్సెస్ అవుతూంటాడు. ఆయన ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఎసైన్మెంట్ మీద ఉన్నారు. భారతదేశాన్ని అన్ని విధాలుగా దెబ్బకొట్టి, గుప్పిట్లో పెట్టుకోవాలని  పరితపిస్తున్న గాడ్ (డినో మారియా)ని పట్టుకోవాలని టార్గెట్. గాడ్ కు ఇంటర్నేషనల్ గా కొంతమందితో కలిసి సిండికేట్ ఏర్పాటు చేసి ఉన్నాడు. అతన్ని పట్టుకోవటానికి పంపిన ప్రతీ స్పైని పైకి పంపేస్తున్నాడు. అలాంటి టైమ్ లో డెవిల్ సిస్టమ్ ని రిక్కీ ఎందుకు హ్యాక్ చేశాడు. రిక్కీ చేసిన పని వల్ల మహాదేవ్ గాడ్ ను చంపడానికి రిక్కీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? మిషన్ మొదలైన తర్వాత రిక్కీ ఎం చేశాడు? మధ్యలో రిక్కీ వైద్య (సాక్షి వైద్య)తో ఎలా ప్రేమలో పడతాడు ? చివరికి ఎం జరిగింది అనేది ఈ సినిమా కథ.

Image

మూవీ విశ్లేషణ (Agent Movie Review)..

రా ఏజెంట్స్ (గూఢచారి) నేపథ్యంలో వచ్చే చిత్రాలు అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అందులో సందేహం లేదు.. కానీ ఎంత ఎంగేజింగ్ గా స్టోరీని చెప్పగలిగామనేది సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఈ తరహా ‘రా’ సినిమాల్లో కథలు, కథాంశాలు ఒకేలా ఉన్నప్పటికీ.. థియేటర్లలో చివరి వరకూ కూర్చోబెట్టే ఒకే ఒక్క ఎమోషన్ దేశభక్తి. ప్రేక్షకుడిలో దేశభక్తిని బలంగా బయటకు రప్పించగలిగితే చాలు.. సినిమా హిట్టే. అందుకు బెస్ట్ ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన ‘పఠాన్’. ఈ సినిమాకి – పఠాన్ కి చాలా పోలికలు ఉన్నాయి. కానీ పఠాన్ విడుదల కంటే ముందు ‘ఏజెంట్’ స్టార్ట్ చేశారు. కాబట్టి రెండిటినీ కలిపి పోల్చవద్దు. కోతి లాంటి ఒక అల్లరి కుర్రాడు స్పై అవతారం ఎత్తి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇదేదో యాక్షన్ కామెడీ కథ అనిపిస్తుంది. కానీ కొంతమేర ఇది గాడి తప్పిందేమో అనే అనుమానం ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో, విలన్, ముమ్మట్టి పాత్రలు ఇంట్రడక్షన్ లు, సెటప్ కే వాడేశారు. దాంతో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఆసక్తిగా నడిపించి మెప్పించేందుకు ట్రై చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని బావున్నాయి.. కొంచెం శ్రద్ద పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. పూర్తి స్థాయిలో అయితే ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందా నేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.

నటీనటులు ఎలా చేశారంటే..

అఖిల్ అక్కినేనిని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇది స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. అఖిల్ అక్కినేని పడిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. ప్యాక్డ్ బాడీ, హెయిర్ స్టయిల్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నటుడిగానూ కొత్తగా కనిపించారు. మమ్ముట్టి పాత్ర పరిధి మేరకు  ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. డెవిల్ పాత్రలో డినో మోరియా నటన బాగుంది. సాక్షి వైద్య క్యారెక్టర్ మూడు పాటలు, నాలుగైదు సన్నివేశాలకే పరిమితమైనా.. ఉన్నంతలో బాగా చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ అయితే జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు ఉంది.  మురళీ శర్మ, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళీ, భరత్ రెడ్డి తదితరుల పాత్రలకు అంతా స్కోప్ లేదు కానీ ఆకట్టుకున్నారు. పాటలు, నేపథ్య సంగీతం సోసోగా ఉన్నాయి. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా, స్టైలిష్ గా ఉంది. నిర్మాత అనిల్ సుంకర ఖర్చుకు అసలు వెనుకాడలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తూ ఉంటుంది.

కంక్లూజన్..

అఖిల్ అదరగొట్టాడు.. కానీ సినిమా ఆ రేంజ్ ఇవ్వలేకపోయిందని సగటు అభిమానిగా నా అభిప్రాయం

 

Image

ఇవి కూడా చదవండి: