Home / పొలిటికల్ వార్తలు
కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
శివరాత్రి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. పండుగ వేళ వైసీపీ చేసిన ఓ ట్వీట్ పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. అది వైసీపీ, బీజేపీ మధ్య ట్వీట్ వార్‌కు దారితీసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Kanna Laxmi Narayana: కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ సీనియర్ నేత తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అధినేత.. చంద్రబాబు నాయుడి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో చేరటానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
Taraka Ratna: నందమూరి తారకరత్న మరణవార్తను తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారకరత్న మృతి.. అభిమానులని, కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
Padi Koushik: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో.. జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
Chiranjeevi: నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.