HD Revanna: హెచ్‌డి రేవన్నకిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. రేప్ అభియోగాలు నమోదు

కర్నాటక ఎమ్మెల్యే హెచ్‌డి రేవన్న చేతిలో కిడ్నాప్‌కు గురైన మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో రేవన్న, అతని కుమారుడు ప్రజ్వల్ కు కొత్త సమస్యలు తలెత్తాయి. హెచ్‌డి రేవన్నకు చెందిన ఫామ్‌హౌస్‌లో గృహిణిగా పనిచేసిన మహిళ వాంగ్మూలాన్ని అనుసరించి కిడ్నాప్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో రేప్ అభియోగాలు జోడించబడ్డాయి.

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 05:59 PM IST

HD Revanna: కర్నాటక ఎమ్మెల్యే హెచ్‌డి రేవన్న చేతిలో కిడ్నాప్‌కు గురైన మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో రేవన్న, అతని కుమారుడు ప్రజ్వల్ కు కొత్త సమస్యలు తలెత్తాయి. హెచ్‌డి రేవన్నకు చెందిన ఫామ్‌హౌస్‌లో గృహిణిగా పనిచేసిన మహిళ వాంగ్మూలాన్ని అనుసరించి కిడ్నాప్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో రేప్ అభియోగాలు జోడించబడ్డాయి.

ఏప్రిల్  29న కిడ్నాప్ కేసు నమోదు..(HD Revanna)

జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు రేవన్న ఆయన సన్నిహితుడు సతీష్ బాబన్నలపై గత నెల ఏప్రిల్ 29న మహిళను అపహరించిన కేసులో కేసు నమోదైంది.మహిళ కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రేవణ్ణ కుమారుడు, జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని హెచ్‌డీ రాజు తన ఫిర్యాదులో ఆరోపించారు.ప్రజ్వల్ రేవన్న ప్రమేయం ఉన్న సెక్స్ టేపుల్లో పలువురు బాధితుల్లో ఈ మహిళ కూడా ఉంది.రేవన్నను శనివారం హై డ్రామా మధ్య అరెస్టు చేశారు. అనంతరం అతడిని మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.రేవన్న ఆయన కుమారుడిపై కూడా వారి ఇంట్లో పనిచేసే మరో మహిళ ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావడానికి ప్రజ్వల్ రేవణ్ణ కోరిన ఏడు రోజుల గడువు మంగళవారంతో ముగిసింది. ప్రజ్వల్ కోసం బ్లూ కార్నర్ నోటీసుతో పాటు భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలలో లుక్ అవుట్ నోటీసు జారీ చేయబడింది.కిడ్నాప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులో ఉన్న రేవన్నను మే 14 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.