Assembly Bypolls: దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి, మూడు చోట్ల ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నాయి.
రెండు సీట్లలోనే బీజేపీ గెలుపు.. (Assembly Bypolls)
పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ నియోజకవర్గంలో ఆప్‌కి చెందిన మొహిందర్ భగత్ 23,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారుపశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసిన నాలుగు స్థానాలనూ కైవసం చేసుకోవడం ద్వారా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను నిలుపుకుంది.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ డెహ్రా నియోజకవర్గంలో విజయం సాధించారునలగర్ సీటును గెలుచుకుని కాంగ్రెస్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగా, హమీర్‌పూర్‌లో బిజెపి విజయం సాధించగలిగింది.తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ దాదాపు 60,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానాన్ని బీజేపీకి చెందిన కమలేష్ ప్రతాప్ షాహి గెలుచుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు కావడంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే మొత్తం 293 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 232 సీట్లను కైవసం చేసుకుంది.