Site icon Prime9

PM Modi: దేశంలోనే నెంబర్‌ వన్‌ నాయకుడిగా ప్రధాని మోదీ – ముఖ్యమంత్రుల్లో పవర్ఫుల్‌ సీఎంగా చంద్రబాబు టాప్‌

Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే నిర్వహించింది. తాజాగా ఇండియా టుడే ఈ సర్వేను ప్రకటించగా.. దేశంలో రాజకీయంగా మోదీ శక్తివంతమైన నాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్టు ఇండియా టుడే తన సర్వేలో తెలిపింది. రాష్ట్రాల వారిగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉండగా.. దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నారు.

దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో చంద్రబాబు నాయుడు 5వ స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రుల్లో ఆయన నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. మోదీ వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికై అరవై ఏళ్ల రికార్డును తిరగరాశారు. అమెరికా వంటి అగ్రదేశంతో పాటు రష్యా ఉక్రెయిన్, ఇజ్రయెల్‌ వంటి దేశాల అధినేతలతో ఏకకాలంలో సత్సంబంధాలు కొనసాగిస్తూ భాతర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ప్రధానిగా ఆయన భారత ఆర్థిక వ్యవస్థను నాలుగు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెవెళ్లినట్టు ఇండియా టుడే తన సర్వేలో పేర్కొంది. ఇక కేంద్రంలో నరేంద్రమోదీ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా మూడో స్థానంలో అమిత్‌ షా ఉన్నారు. వ

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఉన్నారు. కాగా 2019 ఎన్నికల్లో పరాజయం పొంది.. ఆ తర్వాత జైలుకు వెళ్లినా.. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యారు. సీఎంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్‌సభ సభ్యులు, కూటమిపార్టీలతో కలిసి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకుని ఎన్టీయేలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీని నిలిపారు. ముఖ్యమంత్రుల్లో సీనియర్‌గా ఉన్న చంద్రబాబు రాష్ట్ర పరిపాలనలో తనదైన విజన్‌తో ముందుచూపుతూ వెళుతున్నారు.

Exit mobile version