Home / జాతీయం
జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంజుమన్ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయనుంది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది.
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
లోకసభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రమనస్తాపం చెందారు. లోకసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రవర్తనతో ఆయన విసుగు చెందారు. సభను సజావుగా సాగనీయకుండా అడుగడుగునా అడ్డుతగలడంతో ఆయన సభకు రాకుండా ముఖం చాటేశారు. సభ్యుల తీరులో మార్పు వచ్చే వరకు తాను సభలకు హాజరుకాబోనని తన సన్నిహితులకు చెప్పారని తెలిసింది.
ప్రముఖ భారతీయ కళా దర్శకుడు నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని వయస్సు 58. అతని మృతదేహం కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ రాయ్‌గఢ్‌లోని అతని ఎన్డి స్టూడియోలో కనుగొనబడింది. అతను ఎన్డి స్టూడియోస్ యజమాని . పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కర్జాత్‌లోని తన స్టూడియోలో దేశాయ్ ఉరివేసుకుని కనిపించాడు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఊరేగింపుపై దాడిని పెద్ద కుట్రలో భాగమని అభివర్ణించారు. మరోవైపు వీహెచ్‌పీ జాతీయ దర్యాప్తు సంస్ద ద్వారా విచారణకు డిమాండ్ చేసింది.
మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు చర్చ జరగనుంది.ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న సమాధానం ఇవ్వనున్నారు.జూలై 26న ప్రతిపక్ష పార్టీల తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక పౌరుడు మరియు ఒక ఇమామ్‌తో సహా నలుగురు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానే జిల్లా షాపూర్లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెల్లవారు జామున బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 17 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో బాధిత మహిళల పిటిషన్ ను విచారించినభారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. మే 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని, 14 రోజుల పాటు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.