Home / జాతీయం
మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా.. ఆ వ్యక్తి మన కన్నా ముందో వెనుకో చనిపోక తప్పదు అనే నిజాన్ని మరచి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అంటే ఓ కుటుంబం చేసిన ఈ వింత పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. చనిపోయిన వారు బతికొస్తారంటూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మూడురోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేశారు.
చచ్చి బతికాడురా, అదృష్టం అంటే ఇదేరా అనే పదాలను కొన్ని సార్లు కొంత మందిని చూస్తే నిజమే అనిపిస్తుంది. బీహార్‌లో భాగల్ పూర్లో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు ఇలానే అనకమానరు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసెయ్యండి.
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
కేరళలో ఒక వధువు తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడపడానికి 'అనుమతి' ఇస్తానని ఆ సమయంలో అతనికి కాల్ చేయనని పేర్కొంటూ ఒక ఒప్పందం పై సంతకం చేసింది.
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ (జిఆర్ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.
రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాసాడు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర పోలీసులు దళానికి ఎంపికై ఓ యువకుడిని పచ్చబొట్టు కారణంగా తను అర్హుడు కాదన్నారు ఉన్నతాధికారులు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ వ్యక్తి దిల్లీ హైకోర్డును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది.