Last Updated:

Lic Share In Adani Group: అదానీని నమ్మి 18 వేల కోట్లు పోగొట్టుకున్న ఎల్ఐసీ

అదానీ గ్రూపు పై అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఆ కంపెనీ షేర్లను కుదిపేస్తున్నాయి.

Lic Share In Adani Group: అదానీని నమ్మి 18 వేల కోట్లు పోగొట్టుకున్న ఎల్ఐసీ

Lic Share In Adani Group: అదానీ గ్రూపు పై అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఆ కంపెనీ షేర్లను కుదిపేస్తున్నాయి.

అదానీ గ్రూప్ తన షేర్లో భారీగా అవకతవకలు, మోసాలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు భారీగా నష్టపోయారు. వాటిలో ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ( ఎల్ఐసీ) ఒకటి.

అదానీ గ్రూప్ షేర్స్ అల్లకల్లోలం కారణంగా ఎల్ఐసీ రెండు రోజుల్లో 18 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ఈ నెల 24 నాటికి అదానీ కంసెనీల్లోని ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 81,268 కోట్లు కాగా, శుక్రవారం నాటికి అవి రూ. 62,621 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 18, 647 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

అదానీ గ్రూప్ కు సంబంధించిన అన్ని సంస్థల్లో ఎల్ఐసీ 1-9 శాతం స్థాయిల్లో వాటాలు ఉన్నాయి.

గడిచిన రెండు రోజుల్లో అదానీ షేర్లు 19 నుంచి 27 శాతం మేర క్షీణించాయి.

 

అదానీ గ్రూపులో ఎల్ఐసీ వాటా

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్ఐసీ కి 4.23 శాతం షేర్లు ఉన్నాయి. గత రెండు రోజుల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ రూ. 3,442 నుంచి రూ. 2,768. 50 కు చేరింది. అంటే రూ. 673 తగ్గడంతో ఎల్ఐసీకి రూ. 3,245 కోట్ల నష్టం వచ్చింది.

ఎల్ఐసీ కి అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ లో  1.28 శాతం షేర్లు ఉన్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్స్ లో ఈ కంపెనీ షేరు రూ. 430.55 తగ్గింది. దీంతో ఎల్ఐసీ కి రూ. 875 కోట్ల నష్టం.

అదానీ పోర్ట్స్‌ లో ఎల్ఐసీకి 9.14 శాతం షేర్లు ఉన్నాయి. రెండు రోజుల్లో అదానీ పోర్ట్స్ షేర్ ధర రూ. 761.20 నుంచి రూ. 604.50 కు పడిపోయింది. దాని వల్ల 3,095 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది ఎల్ఐసీ.

అదానీ ట్రాన్స్‌ మిషన్‌లో ఎల్ఐసీ వాటా 3.65 శాతం. గడిచిన రెండు రోజుల్లో అదానీ ట్రాన్స్ మిషన్ షేర్ ధర 747.95 తగ్గింది. దీంతో ఎల్ఐసీకి 3,042 కోట్ల నష్టం వాటిల్లింది.

ఎల్ఐసీ కి అదానీ టోటల్‌ గ్యాస్‌ లో  5.96 శాతం వాటా ఉంది. గత రెండు రోజుల్లో షేరు ధర రూ. 963.75 తగ్గడంతో దాదాపు రూ. 6,323 కోట్ల నష్టాన్ని ఎల్ఐసీ చవిచూసింది.

LIC

 

ప్రమాదంలో సామాన్యుల డబ్బు

ఏ మ్యూచువల్ ఫండ్ చేయనంత భారీగా అదానీ గ్రూపు లో ఎల్ఐసీ పెట్టుబడి పెట్టింది. దేశంలోని మ్యూచువల్ కంపెనీ కూడా అదాన్ గ్రూప్ లో 1 శాతం మించి వాటా పెట్టలేదు.

కానీ ఎల్ఐసీకి అదానీ గ్రూపులోని 5 సంస్థల్లో 1 నుంచి 9 శాతం వాటా ఉంది. అయితే హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుప్పకూలే పరిస్థితికి వచ్చింది.

దీంతో దేశంలోని కోట్ల మంది సామాన్యుల డబ్బు ప్రమాదంలో పడింది.

తనవద్ద ఉన్నది ప్రజల కష్టార్జితం అనే ఆలోచన లేకుండా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ , అదానీ కంపెనీల్లో ఇష్టమొచ్చినట్టు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటోంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/