Indore: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా ఏడోసారి ఇండోర్

దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మరోసారి నెంబర్‌ వన్‌గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్‌తోపాటు గుజరాత్‌లోని సూరత్‌ కూడా క్లీనెస్ట్‌ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది.

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 07:44 PM IST

Indore: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మరోసారి నెంబర్‌ వన్‌గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్‌తోపాటు గుజరాత్‌లోని సూరత్‌ కూడా క్లీనెస్ట్‌ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది.

పరిశుభ్రత నగరాల జాబితాలో..(Indore)

పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (9) నగరాలు టాప్‌ 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్‌ 100 లిస్ట్‌లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం.విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ స‌ర్వేక్షణ అవార్డుల‌ను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్‌ ర్యాంక్‌ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది.