Shyam Sharan Negi: భారత తొలి ఓటర్ నెగీ కన్నుమూత

స్వాతంత్య్ర అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తన మొదటి ఓటును వినియోగించుకుని స్వతంత్ర భారత తొలి ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ. అలాంటి శ్యామ్‌ శరణ్‌ నేగీ తన 106 ఏళ్ల వయస్సులో ఇవాళ అనగా శనివారం నాడు కన్నుమూశారు.

 Shyam Sharan Negi: ఓటు వెయ్యడం మన ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో లిఖించబడి ఉంది. మనం వేసే ఒక్క ఓటు మన తలరాతను మార్చుతుందని, ఓటు ద్వారా సమర్దత గల నాయకులను ఎన్నిక చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తుంది. అయితే అలాంటి ఓటును మొట్టమొదటి సారి అనగా స్వాతంత్య్ర అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తన మొదటి ఓటును వినియోగించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ. అలా ఆయన స్వతంత్ర భారత తొలి ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి శ్యామ్‌ శరణ్‌ నేగీ తన 106 ఏళ్ల వయస్సులో ఇవాళ అనగా శనివారం నాడు కన్నుమూశారు.

గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేగీ ఈ రోజు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్‌లోని కిన్నౌర్‌కు చెందిన నేగీ 1917 జులై 1న జన్మించారు. స్కూల్‌ టీచర్‌గా చాలా కాలం విధులు నిర్వహించారు. కాగా స్వాతంత్ర్యం తర్వాత దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఏడాది అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి నెగీనే కావడం విశేషం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. వందేళ్లు దాటినా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి నేటితరానికి ఆదర్శరంగా నిలిచారు.

అయితే తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబరు 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇటీవల నవంబర్ 2న ఆయన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును 34వ సారి వినియోగించుకున్నారు. నేగీ అనారోగ్యం దృష్ట్యా అధికారులే ఆయన ఇంటికి వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించారు. నేగీ మృతిపట్ల హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. నేగీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా
కేంద్ర ఎన్నికల సంఘం కూడా నెగీ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం- పవన్ ఫైర్