Hyderabad:హైదరాబాద్ నగరం సంక్రాంతి సెలవుల రోజులను తలపిస్తుంది .ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ, తెలంగాణ ఓటర్లు స్వస్థలాల బాటపడుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు నగరంలోని బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది.
ఏపీకి వెళ్లే ప్రైవేటు బస్సులు, రైళ్లలో ఇప్పటికే సీట్లు ఫుల్‌కావడంతో రిజర్వేషన్ టికెట్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండటంతో బస్టాండ్లకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో మియాపూర్, కూకట్‌పల్లి, ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ,హయత్ నగర్ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఓటేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తుండటంతో సందడిలో సడేమియా అన్నట్లు ప్రైవేటు ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రైవేటు బస్సులతో పాటు ఇతర వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. విజయవాడకు ఏకంగా రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ అందుబాటు ధరల్లోనే టికెట్లను విక్రయిస్తోంది. మరిన్ని బస్సులు పెంచితే