Site icon Prime9

Pawan Kalyan: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం- పవన్ ఫైర్

pawan kalyan fires on ycp leaders in ippatam

pawan kalyan fires on ycp leaders in ippatam

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. ఆ తర్వాత మరల కారు ఎక్కి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి” అంటూ వేలు చూపిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను మాత్రం ఇప్పటం వెళ్లాల్సిందే.. అక్కడి బాధితులను పరామర్శించాల్సిందే అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గ్రామంలోకి పవన్ చేరకుండా కంచెలు వేసి మరీ ఆయనను ఆపే ప్రయత్నం చేశారు అధికారులు. దానిని ఏ మాత్రం లెక్కచెయ్యకుండా ముందుకు సాగారు పవన్.

“వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం” అని పవన్ హెచ్చరించారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ముందు 15 అడుగుల రోడ్డే ఉందని అక్కడెందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. గుంతలు పూడ్చలేదు, నూతన రోడ్లు వెయ్యలేదు అభివృద్ధి చెయ్యరు కానీ రోడ్లు విస్తరిస్తామని చెప్పడానికి సిగ్గుండాలని ఆయన ఫైర్ అయ్యారు. జనసైనికుల కోసం నేను రక్తం చిందించడానికి సిద్ధం కాల్చుకుంటారా కాల్చుకోండి అంటూ పవన్ అన్నారు. అన్యాయం జరుగుతుంటే చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోకుండా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలని ఆయన జనసైనికులకు పిలుపునిచ్చారు.

గతంలో జనసేన ఆవిర్భావ సభను ఇప్పటం గ్రామంలో నిర్వహించారు పవన్. ఈ సభకు గానూ తమ గ్రామంలోని స్థలాలను కొందరు వ్యక్తులు ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ సభలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షల సాయం ప్రకటించారు. అలా ఆ నాడు జనసేనకు స్థలాలు ఇచ్చారనే నేడు ఇలా వైసీపీ అరాచకాలు సృష్టిస్తుందని పవన్ ఆరోపించారు.

ఇదీ చదవండి: చంద్రబాబు కాన్వాయి పై దాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు

Exit mobile version