POCO F7 Series Launched: పోకో తన శక్తివంతమైన F సిరీస్‌ని విస్తరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో POCO F7, POCO F7 Pro, POCO F7 Ultrs మోడల్‌లు ఉంటాయి. ఇటీవల POCO F7 ప్రో IMDA సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించింది. ఇంతలో ఇప్పుడు POCO F7, POCO F7 Ultrs ఒకే ఆన్‌లైన్ డేటాబేస్‌లో గుర్తించారు. ఈ తాజా సిరీస్ హ్యాండ్‌సెట్‌లను త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
IMDA సర్టిఫికేషన్‌లో రాబోయే రెండు స్మార్ట్‌ఫోన్‌లు మోడల్ నంబర్‌లు 24122RKC7G, 2412DPC0AGగా ఉన్నాయి. దీనిలో POCO స్మార్ట్‌ఫోన్ గురించి ఎక్కువ సమాచారాన్ని వెల్లడించనప్పటికీ, ఇది 5G కనెక్టివిటీ, బ్లూటూత్, Wi-Fi, NFCకి సపోర్ట్ ఇస్తుంది. అదనంగా POCO F7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
POCO F7, POCO F7 Ultra పేర్లు ఇప్పటికే IMEI డేటాబేస్‌లో కనిపించాయి. రెండోది మొదటి “అల్ట్రా” బ్రాండ్ ఫోన్. POCO F7 అల్ట్రాను Redmi K80 Pro రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. K80 Pro మోడల్ త్వరలో చైనీస్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది కొన్ని గొప్ప స్పెక్స్, ఫీచర్లను కలిగి ఉంది. రెడ్‌మీ K80 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCని కలిగి ఉన్నట్లు లీక్ వచ్చింది. ముందు భాగంలో ఇది 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
POCO F7 Ultra భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మోడల్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే మొదటి మోడల్ కూడా కావచ్చు. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో Redmi Turbo 4 టిప్పింగ్ 3C సర్టిఫికేషన్‌లో రిజిస్టర్ అయింది. POCO F7 రీబ్రాండెడ్ Redmi Turbo 4గా వస్తుందని భావిస్తున్నారు. ఈ మోడల్ MediaTek డైమెన్సిటీ 8400 SoC, 6000mAh బ్యాటరీ ప్యాక్, 1.5K రిజల్యూషన్‌తో పాటు మరెన్నో ఫీచర్లతో రానున్నాయి.