Site icon Prime9

Khushbu Sundar: ఆ స్టార్‌ హీరో నాతో అసభ్యంగా మాట్లాడాడు – చెప్పుతో చెంప పగలకొడతానని వార్నింగ్‌ ఇచ్చా..

khushbu on Women Safty

Khushbu sundar At IFFI: ప్రస్తుతం గోవాలోని పనాజీలో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా-2024(IFFI) వేడుకలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమారం ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ వేడుకలో నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్భూ సుందరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే అంశంపై నిర్వహించిన సెషన్‌లో ఆమె భాగమయ్యారు.

దీనిపై మాట్లాడుతూ తనకు ఓ హీరో నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. బస్సుల్లో, ట్రైన్‌లో, ఆటోనూ మహిళలకు రక్షణ లేదు. ఒకనొక సమయంలో తాను కూడా ఓ స్టార్‌ హీరో వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పారు. “గతంలో ఓ సినిమా సెట్‌లో ఓ స్టార్‌ హీరో నాతో అసభ్యకరంగా మాట్లాడాడు. నాకు ఏదైనా చాన్స్‌ ఉందా? అని అడిగాడు. వెంటనే నేను ‘నా చెప్పుల సైజు 41. నీ చెంప ఇక్కడే పగలకొట్టానా? లేదా సెట్లో అందరి ముందు పగలకొట్టానా? అని వార్నింగ్‌ ఇచ్చా’.

సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాలని పరిశ్రమలోకి వచ్చాను. సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది నా సిద్ధాంతం. ఆ విధంగానే నేను పని చేస్తూ వచ్చాను” అని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల మలయాళ సినీ ఇండస్ట్రీపై ఇచ్చిన హేమ కమిటీ రిపోర్టు వెలుగులో రావడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొంటున్నారని రిపోర్టులో వెల్లడైంది. ఈ రిపోర్టు తర్వాత ఎంతోమంది నటీమణులు బయటకు వచ్చి తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టారు.

హేమ కమిటీలోని విషయాలు తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం విస్తుపోయారు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లు దారుమైన అనుభవాలు చూస్తున్నారని, ఇక్కడ మహిళల సంరక్షణ ప్రశ్నార్థకంగా ఉందని పలువురి నుంచి అభిప్రాయాలు వచ్చాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హేమకమిటీ రిపోర్టు హాట్‌టాపిక్‌గా నిలిచిన నేపథ్యంలో దీనిపై ఇఫిలో చర్చ జరపగా.. ఇందులో ఖుష్బూ, సుహాసిని, ఇతియాజ్‌ అలీ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఏ రంగంలో అయినా తమకు నచ్చనిది జరుగుతున్నప్పుడు మహిళలకు నో చెప్పడం తెలియాలని సూచించారు.

Exit mobile version