Site icon Prime9

Mohan Babu: ‘కన్నప్ప’లో మోహన్‌ బాబు కీ రోల్‌ – ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అవుట్‌, ఆయన పేరేంటంటే

Mohan Babu Look From Kannappa: మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ పాన్‌ ఇండియా తెరకెక్కుతుంది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాను 24 ఫిలిమ్స్‌ ఫ్యాక్టరి బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చేందిన స్టార్స్‌ భాగమయ్యారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ అక్షయ్‌ కుమార్‌, మలయాళ నటుడు మోహన్‌ లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌తో వంటి స్టార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాతో మంచు విష్ణు కుమారుడు అవ్‌రాం డెబ్యూ ఇస్తున్నాడు. . అప్పుడప్పుడు ఇందులో పాత్రలను పరిచయం చేస్తూ వస్తుందని టీం.

తాజాగా మోహన్‌ బాబు రోల్‌ని రివీల్‌ చేశారు మేకర్స్‌. ఇందులో ఆయన మహాదేవ శాస్త్రీగా ప్రధాన పాత్రప పోషిస్తున్నారు. ఈ పోస్టర్‌లో మోహన్‌ బాబు ఖుషిగా కాషాయ రంగు బట్టలు ధరించి సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం మోహన్‌ బాబు లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌, పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా ఎక్కువ భాగంగా లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని మంచు విష్ణు చెప్పారు. కానీ, వచ్చే ఏడాది 2025లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇటీవల విష్ణు స్పష్టం చేశారు. కాగా కన్నప్ప దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సినీ సర్కిల్లో టాక్‌.

Exit mobile version