Site icon Prime9

Gang Rape : ఆగ్రాలో దారుణ ఘటన.. యువతిపై సామూహిక అత్యాచారం

Gang Rape attempt on 25 years young girl at agra

Gang Rape attempt on 25 years young girl at agra

Gang Rape : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ నగరంలో ఈ తరహా ఘటనలు జరగడం ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తుంది. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదని.. ఇప్పుడు మళ్ళీ యూపీలో ఇలాంటి ఘటనే వెలుగులోకి రావడం పట్ల మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

స్థానికంగా ఉన్న ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె తలపై గాజు సీసాను పగలగొట్టారు. సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియోను చూపించి ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే యువతి పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన వారు ఆమెను రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

ఈ ఘటనలో నలుగురు యువకులతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. హోంస్టే రెంట్‌కు ఇచ్చే ఆస్తులను సీజ్ చేసినట్టు వివరించారు. నిందితులందరూ ఆగ్రాకు చెందినవారేనని పేర్కొన్నారు. ఆ యువతి వయస్సు 25 సంవత్సరాలుగా తెలిపారు.

 

Exit mobile version