Site icon Prime9

Tecno Pop 9 Launched: చీప్ వెరీ చీప్.. రూ. 6,499లకే స్మార్ట్‌ఫోన్.. అస్సలు మిస్ అవ్వొద్దు..!

Tecno Pop 9 Launched

Tecno Pop 9 Launched

Tecno Pop 9 Launched: టెక్నో తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ టెక్నో పాప్ 9ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది  4G ఫోన్, కంపెనీ దీనిని అమెజాన్ ద్వారా విడుదల చేసింది. ఫోన్ ధర రూ.6,500 కంటే తక్కువ. చౌకగా ఉన్నప్పటికీ, ఇది శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. MediaTek G50 ప్రాసెసర్‌తో కూడిన భారతదేశంలో ఇదే మొదటి ఫోన్ అని కంపెనీ తెలిపింది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 13MP కెమెరా,  5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 840 గంటల స్టాండ్‌బై టైమ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. టెక్నో ఈ aకొత్త ఫోన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

Tecno Pop 9 5G Price
టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్ 6GB RAM +64GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసింది. దీని ధర రూ. 6,499. నవంబర్ 26 నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఇది గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్ట్రైల్ బ్లాక్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Tecno Pop 9 5G Specifications
కొత్త Tecno Pop 9 ఆండ్రాయిడ్ 14 Go ఆధారంగా HiOS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే, HD ప్లస్ రిజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 20:09 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio G50 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీని గురించి కంపెనీ ఈ సెగ్మెంట్‌లో ఇది మొదటి ఫోన్ అని చెబుతుంది. ఇది ఈ ప్రాసెసర్‌తో వస్తుంది. చిప్‌సెట్ గరిష్టంగా 6GB (3+3GB) RAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్‌‌ని కలిగి ఉంటుంది. స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్  కెమెరా ఉంది. ఇది 4x డిజిటల్ జూమ్, AI క్యామ్, వీడియో, బ్యూటీ మోడ్, పోర్ట్రెయిట్, టైమ్-లాప్స్, పనోరమా, ప్రొఫెషనల్, స్లో మోషన్, 1080P వీడియో రికార్డింగ్ వంటి కెమెరా మోడ్‌లతో వస్తుంది. వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది డ్యూయల్ కలర్ టెంపరేచర్ ఫ్లాష్, 2X డిజిటల్ జూమ్, AI క్యామ్, బ్యూటీ మోడ్, పోర్ట్రెయిట్, టైమ్-లాప్స్, వీడియో, వైడ్ సెల్ఫీ, 1080P వీడియో రికార్డింగ్‌తో వస్తుంది.

ఫోన్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది 840 గంటల స్టాండ్‌బై, 32 గంటల కాలింగ్, 9.5 గంటల వీడియో ప్లేబ్యాక్, 100 గంటల మ్యూజిక్ ప్లేటైమ్‌ను అందిస్తుంది అని కంపెనీ తెలిపింది. ఫోన్ స్పెషల్ ఫీచర్స్ ఇన్-బిల్ట్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సార్, DTS తో డ్యూయల్ స్పీకర్లు, డస్ట్-వాటర్ నుండి సురక్షితంగా ఉండటానికి IP54 రేటింగ్, 3 సంవత్సరాల లాగ్ ఫ్రీ పర్ఫామెన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్, వైఫై, జిపిఎస్, బ్లూటూత్, ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version