Gyanvapi Case: వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) మరో 21 రోజుల గడువు కోరింది. ఏఎస్‌ఐ తన నివేదికను నవంబర్ 28న సమర్పించవలసి ఉంది.
నివేదికను సమర్పించడానికి ఏఎస్‌ఐకి నవంబర్ 17 వరకు సమయం ఇవ్వబడింది, అయితే దాని న్యాయవాది కోర్టు నుండి మరో 15 రోజులు కోరారు. హిందూ గ్రూపు తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ ప్రకారం, సాంకేతిక నివేదిక అందుబాటులో లేని కారణంగా ఏఎస్‌ఐ మరింత సమయం కోరింది.గత వారం ఈ కేసును విచారించిన జిల్లా జడ్జి ఎకె విశ్వేష్ నవంబర్ 28లోగా తన నివేదికను సమర్పించాలని ఎఎస్‌ఐని కోరారు. ఎఎస్‌ఐ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 17వ శతాబ్దంలో నిర్మించిన మసీదు పూర్వపు హిందూ దేవాలయం పైన నిర్మించబడింది.అంతకుముందు ఏఎస్‌ఐ నవంబర్ 2న తాను సర్వేను పూర్తి చేసానని, అయితే సర్వే పనిలో ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు నివేదికను రూపొందించడానికి మరికొంత సమయం పట్టవచ్చని కోర్టుకు తెలిపింది. .
అక్టోబర్ 5న, కోర్టు ఏఎస్‌ఐ కి మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. సర్వే వ్యవధిని ఇంతకు మించి పొడిగించబోమని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను సమర్థించి, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య తప్పనిసరి అని తీర్పునిచ్చిన తర్వాత ఈ సర్వే ప్రారంభమయింది. ఇంతకుముందు జరిగిన విచారణలో మసీదు నిర్వహణ కమిటీ సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏఎస్‌ఐఅనుమతి లేకుండా మసీదు కాంప్లెక్స్‌లోని నేలమాళిగతో పాటు ఇతర ప్రదేశాలను తవ్వడం మరియు పశ్చిమ గోడపై శిధిలాలు పేరుకుపోవడం వల్ల నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపించింది.శిథిలాలు లేదా చెత్తను తొలగించడం ద్వారా ప్రాంగణాన్ని సర్వే చేయడానికి ఏఎస్‌ఐబృందానికి అధికారం లేదని కమిటీ పేర్కొంది.హైకోర్టు ఆదేశాలపై జ్ఞాన్‌వాపీ కమిటీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏఎస్‌ఐ సర్వేపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఆగస్టు 4న సుప్రీంకోర్టు నిరాకరించింది.