Last Updated:

Priyanka Gandhi: తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగీరు కాదు.. ప్రియాంక గాంధీ

తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగీరు కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని అయితే తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

Priyanka Gandhi: తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగీరు కాదు.. ప్రియాంక  గాంధీ

Priyanka Gandhi: తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగీరు కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని అయితే తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన యువసంఘర్షణ సభలో ఆమె కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

అమరవీరుల త్యాగం వృధా కాకూడదు..(Priyanka Gandhi)

జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక తెలంగాణ మీకు నేల కాదు, మీకు తల్లి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ ఇంకా నెరవేరలేదు.
బీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టేందుకు మీరు పోరాడలేదు.సీఎం కేసీఆర్ చెప్పిన ఇంటికో ఉద్యోగం నెరవేరలేదన్నారు. తెలంగాణ కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారని వారిలో శ్రీకాంతాచారి ఒకరని ప్రియాంక గాంధీ అన్నారు. అమరవీరుల త్యాగం వృధా కాకూడదనే విషయం మాకు తెలుసు.మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారు. 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదని ప్రజల ఆకాంక్షను గమనించి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రైతులకు నీళ్లు, పంటలకు తగిన ధర రావాలని ఆకాంక్షించారు.తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలు కూడా హైదరాబాద్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మీ కలలను భగ్నం చేసే ప్రభుత్వం ఇక్కడ ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రియాంక టార్గెట్ చేసారు.

5 అంశాలతో యూత్ డిక్లరేషన్..

ఈ సందర్బంగా ప్రియాంకగాంధీ 5 అంశాలతో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. వాటిలో ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల పెన్షన్,. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదినే 2 లక్షల ఉద్యోగాల భర్తీ,. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.4 వేల భృతి, ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
నిరుద్యోగ యువతకు 10 లక్షల వడ్డీలేని రుణాలు తదితర అంశాలు ఉన్నాయి. యూత్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్‌ది అని మేము అమలు చేయకపోతే మా ప్రభుత్వాన్ని దించేయాలని ప్రియాంక గాంధీ అన్నారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్శిటీలు సామాజిక చైతన్యానికి వేదికలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదన్నారు.
తెలంగాణ యువతకు అండగా నిలబడటానికి ప్రియాంక వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని వెంటనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని చెప్పారు.

 

https://youtu.be/cSC8QMHZIA8