Home / తప్పక చదవాలి
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.
UPSC: రేపటితో ముగియనున్న యూపీఎస్సీ గడువు
ఇన్‌స్టా దీనికి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఉండే ఫీచర్లు నేటి యువతరానికి తెగ నచ్చేశాయనుకోండి. సామాజిక మాధ్యమైన ఇన్‌స్టా వాడని యువత ఉండరు అనడంలో ఆశ్చర్యంలేదు. అయితే వినియోగదారుల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా దసరాను జరుపుకుంటుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా కనుమరుగవుతుంది.
దేశం ఆయన వెంట నడిచింది. యావత్తు దేశం ఆయన మార్గమే దిక్కనింది. వేసిన ప్రతి అడుగు ఓ చుక్కానిలా మారింది. హింసలోనే అహింస దాగివుందని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగింది ఆయన జీవిత ప్రయాణం. మరణం కాదు ముఖ్యం, శాసనం ప్రధానం అంటూ శత్రువుల గుండెల్లో శాంతి కపోతాలు ఎగరవేసిన ధైర్యశాలి ఆయన రూపం.
కేంద్ర ప్రభుత్వ వార్షిక పరిశుభ్రత సర్వే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’ ఫలితాలు శనివారం ప్రకటించారు.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడతాయని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. గ్యాస్ బండ ధరను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. అది కూడా వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొనింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.