Home / తప్పక చదవాలి
దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది
దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సుప్రీం కోర్టు ప్రత్యక్ష్య ప్రసారాల వీక్షణ ఎట్టకేలకు ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ యు.యు. లలిత్ అండ్ టీం ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యక్ష్య ప్రసారాలను సర్వోత్తమ న్యాయస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
దసరా వేడుకలు సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులు,దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసి అదేశాలు జారీ చేసింది.వారికి వారికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,అలాగే ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి సెప్టెంబర్ 26వ సోమవారం నుంచే అధికారికంగా అమల్లోకి వస్తాయంటూ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు పలు రకాల పోస్టుల నోటిఫికేషన్ వెల్లడించారు.ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO), చీఫ్ డిజిటల్ ఆఫీసర్ (CDO) మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ వెల్లడించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ విజయంతో టీం ఇండియా టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టడమేకాక కొత్త రికార్డును సృష్టించింది.
ఒకవైపు భార్య మంచం పట్టింది.. మరోవైపు ఎలాంటి చలనం లేని దివ్యాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె. ఆమెకు అన్నం తినిపించడంతోపాటు అన్ని పనులు కన్న తండ్రే చేయవలసి వచ్చేది.
మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అక్టోబరు1నుంచి దేశంలోని 13 ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన సేవల లభ్యత గురించి ప్రగతి మైదాన్‌లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రకటించనున్నారు.