Home / తప్పక చదవాలి
హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులకి బాధితుడు సిద్దార్థ్ దాస్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు సీరియల్ నటుడు మనోజ్ సెలబ్రిటీ క్లబ్ రిసార్ట్స్‌లో ఒక విల్లాలో సిద్దార్థ అనే వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్ మరియు అతని కుటుంబం నెలలో 13,000 టొమాటో క్రేట్లను (బాక్సులు) విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు.
ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ అవినీతి, అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఒక కులం పార్టీని, సమాజాన్ని నడపలేదని దోచుకునే వాళ్లకే కాదు అందిరికీ హక్కులున్నాయని అన్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్దలయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) యొక్క క్యాంపస్ లను విదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఆఫ్రికాలోని టాంజానియాలో, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ ను అబుదాబిలో, ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ ను కౌలాలంపూర్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నారు.
బీహార్ లోని బక్సర్‌లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్‌ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్‌ను అందించనందుకు రెస్టారెంట్‌కు రూ.3,500 జరిమానా విధించారు.
వాట్సాప్ ఐఓఎస్, మరియు ఆండ్రాయిడ్ పరికరాల కోసం యానిమేటెడ్ అవతార్లను పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. యానిమేటెడ్ అవతార్ ఫీచర్ యాప్ యొక్క భవిష్యత్తు అప్డేట్లో చేర్చబడుతుందని భావిస్తున్నారు. వాట్సాప్ డెవలప్మెంట్లను ట్రాక్ చేసే వెబ్సైట్ WABetaInfo ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న Android 2.23.15.6 అప్డేట్ కోసం తాజా వాట్సాప్ బీటా ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది.
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారతదేశంలో 500,000 ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక సామర్థ్యంతో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పెట్టుబడి ప్రతిపాదన కోసం భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది, దీని ప్రారంభ ధరలు రూ. 20 లక్షలుగా ఉండవచ్చని తెలుస్తోంది.
Lucknow Royal Saree: ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు మహా అంటే రూ10వేలు ఉంటుంది. లేదు మరీ కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు.. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా లేదా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఈ చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే.
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విద్యావ్యవస్థను తెలంగాణతో పోల్చడం సరికాదని, రోజూ అనేక కథనాలు, కుంభకోణాలు కనిపిస్తున్నాయన్నారు. టీచర్లను కూడా బదిలీ చేయలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అని బొత్స వ్యాఖ్యానించారు.
సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు.