Home / తప్పక చదవాలి
ఏపీ, తెలంగాణలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రపంచంలోనే మొట్టమొదటి BS6 స్టేజ్ II హైబ్రిడ్, ఇథనాల్-ఆధారిత ఇన్నోవాను ఆవిష్కరించారు. ఇది 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలో రూ. 200 అదనపు సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించిందని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్‌ని పోలీసులు అరెస్టు చేసారు.ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండే వివిధ సాకులతో విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించి అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో ఆటో డ్రైవర్ భార్య రావూరి షీలా డాక్టరేట్ పట్టా పొందారు. ఎంతో పట్టుదలతో సాగిన ఆమె ప్రయాణం ఆమె పలువురికి స్పూర్తిదాయకం. ఆమె పట్టుదలకు భర్త సహకారంతోడయి డాక్టరేట్ పట్టా తీసుకునేలా చేసింది.
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు.
బ్రిక్స్ దేశాల సదస్సులో మన ప్రధాని మోదీతో కలిసి పాల్గొని నాలుగు రోజులు కూడా కాకముందే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు. నిన్న అంటే ఆగస్టు 28న చైనా విడుదల చేసిన కొత్త మ్యాపులో భారతదేశానికి చెందిన ప్రాంతాలని తమవని చెబుతూ ముద్రించారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (ఇండో-పసిఫిక్) గీతికా శ్రీవాస్తవ, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో చార్జ్ డి'అఫైర్స్‌గా బాధ్యతలు చేపట్టే మొదటి మహిళా దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్ట బోతున్నారు.
బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.