Home / తప్పక చదవాలి
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ సమావేశాలు మరియు రాజ్యసభ 261వ సమావేశాలు) 18వ తేదీ నుండి జరుగుతాయి
105 ఏళ్ల రైల్వే మంత్రిత్వ శాఖ చరిత్రలో మొట్టమొదటిసారిగా రైల్వే బోర్డు ఒక మహిళలను సీఈవో మరియు చైర్‌పర్సన్‌గా జయ వర్మ సిన్హాను కేంద్రం ఈరోజు నియమించింది
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మూన్ రోవర్ గురించి ‘X’ (గతంలో ట్విట్టర్)లో కొత్త అప్డేట్ను పోస్ట్ చేసింది.సురక్షితమైన మార్గం కోసం రోవర్‌ను తిప్పారు. భ్రమణం ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడింది. చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది. కాదా? అంటూ ఇస్రో వ్రాసింది.
ఫిలిప్పీన్స్ లోని క్యూజోన్ నగరంలో నివాస ప్రాంతంలోని దుస్తుల కర్మాగారంలో గురువారం మంటలు చెలరేగడంతో 15 మంది మరణించారు. వరదలు, భారీ ట్రాఫిక్ తో అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకోలేకపోయారని అగ్నిమాపక రక్షణ అధికారి తెలిపారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఈ భేటీ కోసం నిన్ననే.. భర్త అనిల్ తో కలిసి.. షర్మిల హస్తిన బయలుదేరి వెళ్లారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? లేక పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు
బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారి విద్యుత్ చార్జీలు భారీగా పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఆగ్రహం కాస్తా ప్రజలను రోడ్డుపైకి తెచ్చేలా చేసింది. విద్యుత్ బిల్లులు చెల్లించమని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెంచిన విద్యుత్ బిల్లులపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇడాలియా హరికేన్ ఫ్లోరిడా గల్ఫ్ తీరం వైపు ప్రయాణిస్తుండటంతో సమీప రాష్ట్రాల్లో అత్యవసర పరిస్దితి నెలకొంది. రాష్ట్రంలోని 67 కౌంటీలలో 49 అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఫ్లోరిడాతో పాటు, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా మరియు జార్జియా కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.