Snake : బాలుడిని కరిచిన నాగుపాము.. తిరిగి బాలుడు కొరకడంతో చనిపోయింది..
ఎనిమిదేళ్ల పిల్లవాడు విషపూరితమైన నాగుపామును కొరకడంతో అది చనిపోయింది.
Snake : ఎనిమిదేళ్ల పిల్లవాడు విషపూరితమైన నాగుపామును కొరకడంతో అది చనిపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు ఈశాన్యంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న జష్‌పూర్ జిల్లాలోని పందర్‌పాడ్‌లో చోటుచేసుకుంది దీపక్ అనే బాలుడు తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్న సమయంలో పాము అతడిని కరిచింది. పాము తన చేతికి చుట్టుకుని కాటు వేసిందని బాలుడు తెలిపాడు. తన చేతిని విదిలించడానికి ప్రయత్నించినా పాము కదలలేదని ఆ సమయంలో తాను పామును రెండు సార్లు గట్టిగా కొరికానని దానితో అది చనిపోయిందని తెలిపాడు.
అనంతరం వెంటనే బాలుడి కుటుంబ సభ్యులు దీపక్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే బాలుడికి పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకరోజంతా పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్ చేసారు. ప్రస్తుతం అతని పరిస్దితి బాగానే వుంది. దీపక్ పై పాము కాటుకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనపడలేదు. అతను త్వరగా కోలుకున్నాడు. దీనిపై స్నేక్ ఎక్స్ పర్ట్ కైజర్ హుస్సియన్ మాట్లాడుతూ దీపక్ పొడి కాటుకు గురయ్యాడని అందుకే విషం విడుదల కాలేదన్నారు. పాము గట్టిగా కాటు వేస్తే కాని విషం విడుదల చేయబడదన్నారు.అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి పాము కాటు ప్రాంతం చుట్టూ మాత్రమే బాధను అనుభవిస్తాడని వివరించారు.