Last Updated:

Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్ర.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్ర.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. (Traffic Restrictions)

శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు.

దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ధర్మం, విలువలకు ప్రతిరూపం ‘శ్రీరాముడు’. శ్రీరాముడిని కీర్తిస్తూ.. భక్తజనం ప్రతి ఏటా పండుగ జరుపుకొంటారు.

ఈ ఏడాది మార్చి 30న చైత్రమాసం శుక్లపక్షం నవమి గురువారం శ్రీరామనవమి. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే.. చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి.

ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు (శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం) నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. దాంతో రేపు దేశవ్యాప్తంగా పండగ జరగనుంది.

శ్రీ రామనవమి వేడుక ఆద్యంతం హైదరాబాద్ లో కన్నుల పండవగా జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లు.. రద్దీ ప్రాంతాల్లో దారి మళ్లీంపులు ఉండనున్నాయి. ముఖ్యంగా గోషామహల్‌, సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి.

ఈ ప్రాంతాల్లో శోభాయాత్ర మొత్తంగా 6 కిలోమీటర్ల మేర ఉండనుంది.

రేపు ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్‌ ఆలయం వద్ద శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది.

నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బోయగూడ కమాన్‌ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి  మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు మీదుగా జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌ వైపు ఈ యాత్ర సాగనుంది. అలాగే జుమేరాత్‌ బజార్‌,  బేగంబజార్‌ చత్రి, గౌలిగూడ కమాన్‌ ద్వారా నుంచి గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా మీదుగా  సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు ఈ యాత్ర చేరుకుంటుంది.

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ప్రధాన మార్గాల్లో  దారి మళ్లింపు ఉండనుంది.

శోభాయాత్ర సమయంలో వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎలాంటి గొడవలు జరగకుండా.. శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో పోలీసులు ఉండనున్నారు. అంతేకాదు నగరం అంతటా రేపు పోలీసులు తిరగనున్నారు.