Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
హైదరాబాద్ నగర శివారులో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్కారం గ్రామ పరిధిలోని ఎర్రకుంట చెరువులో పడి 6మంది చనిపోయారు.
తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తరహాలోనే మరో అధునాతన క్రికెట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి రామగుండంకి రానున్నారు.
తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.
మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపధ్యంలో దీనిపై నిజాంసాగర్ షుగర్ ఫ్యాక్టరీలో టీకాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు.
నవంబర్ 1న సీల్ట్ కవర్ లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చిన్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
మీ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారో? ఇంకా దేనికి వచ్చారో ఇప్పటి వరకు మీకే క్లారిటీ లేదంటూ బీజేపీ నేత డీకే అరుణ టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.