Home / ప్రాంతీయం
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో.. ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మే13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘానికి ఎన్. వేణుగోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దీనిపై ఎన్నికల సంఘం రైతు భరోసా చెల్లింపులను వాయిదా వేయాలని పేర్కొంది.
ఏపీలో జరిగేది క్లాస్ వార్ అని.. సీఎం జగన్ అన్నారు. ఓటు వేసే ముందు అంతా ఒక సారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని.. టీడీపీకి ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్న సందర్బంగా గత పదేళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసారో చెప్పి ఓట్లడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. దయచేసి పవిత్రమైన నేలపై విషం చిమ్మకండని కోరారు. పిరమైన ప్రధాని నరేంద్రమోదీగారు మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలోయావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ సామాజిక మాధ్యమం x వేదికగా ప్రశ్నలు సంధించారు.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని కాపు, బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. తన అంచనాల గురించి 6 నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేశారు.
ఎండలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడని తెలిపారు.
మే 13న జరగనున్న లోక్‌సభ మూడవ విడత ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయడానికి వారికి అవగాహన కార్యక్రమాలు కూడ కల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బైక్ ట్యాక్సీ ప్రొవైడర్ రాపిడో పోలింగ్ రోజున ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉచిత వాహన సేవలు అందించడానికి ముందుకు వచ్చింది.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని మోదీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని వెనక్కు వెళ్లేలా చేసిందని.. గతంలో చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే వెలువడ్డాయని, ఆలస్యం చేయకుండా విధుల్లో చేరాలని ఆదేశించారు.