Rains in Telugu States: రాబోయే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఎండలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Rains in Telugu States: ఎండలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ..( Rains in Telugu States)
తెలంగాణలో నేడు ఆసిఫాబాద్, మంచిర్యాలు, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడల్చ్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు కోస్తాంధ్రలో నేడు వర్షాలు పడే అవకాశం ఉంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ.. కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముంపు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.