Home / ప్రాంతీయం
Komatireddy vs Harish Rao in TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేడు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. బుధవారం అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని విపక్షాలు కోరాయి. ఇదిలా ఉండగా, అసెంబ్లీలో గురువారం నల్లొండ నీటి విషయంపై చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో […]
Cyclone Effect On Andhra Pradesh: మరో తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తా ప్రాంతాలకు ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ […]
Minister Ponguleti Srinivas Reddy Introduced Bhu Bharati Bill: తెలంగాణ అసెంబ్లీలో రికార్డు ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ధరణి పోర్టల్‌ను భూ భారతి గా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్ఓఆర్ 2020 చట్టం రద్దు అవుతోంది. కొత్త చట్టం ప్రకారం.. భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతీ భూ కమతానికి భూదార్ నంబర్ ఇవ్వనుంది. […]
PCC Chief Goud attend Chalo Raj Bhavan rally: మణిపూర్ అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు రాజ్ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ […]
Minister Ponnam Prabhakar fire on BRS MLA’s: ఆటో కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. అందుకే ఈ ఏడాది ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం కొంతమంది అసెంబ్లీకి ఆటోలో వచ్చారు. […]
Deputy CM Pawan Kalyan Speech On Jal Jeevan Mission State Level Workshop: ‘జల్‌జీవన్ మిషన్’ను మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న ‘జల్‌జీవన్ మిషన్’వర్క్ షాప్‌నకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 26 జిల్లాల్లో నీటి వసతులు, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వాటర్ సిస్టం నమూనాలను ఆయన పరిశీలించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌ను ప్రారంభించారు. నీటి […]
BRS MLAs Reached the Telangana Assembly by Autos: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని స్వయంగా తానే నడుపుతూ ఆటో వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. అదే విధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. అలాగే ప్రశాంత్ రెడ్డి, పద్మారావుగౌడ్, కృష్ణారావు ఆటోలో వచ్చారు. అయితే బీఆర్ఎస్ […]
TTD to erect model temple of Lord Venkateswara at Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి ఫిబ్రవరి 26వరకు జరగనున్న మహాకుంభ మేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 45రోజులపాటు సాగే మహాకుంభ మేళాకు 2.5 […]
President Droupadi Murmu advises medical professionals to serve in interior parts of country: కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చిన యువ వైద్యులంతా వెనకబడిన, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో తమ సేవలు అందించేందుకు ముందుకు రావాలిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారంలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప […]
Hydra commissioner ranganath comments: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు అన్ని అనుమతులతో నిర్మించినటువంటి, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లను కూల్చమని ప్రకటించారు. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను కూలుస్తామన్నారు. ఈ మేరకు జులై తర్వాత నుంచి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. అయితే, కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. పేదల ఇళ్లు హైడ్రా అధికారులు కూలుస్తున్నారనే వార్తలు, ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. […]