Home / ప్రాంతీయం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు అందిస్తామన్నారు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలనేపధ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
అనకాపల్లి జిల్లా బవులువాడ గ్రామ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఆవు దూడపై దాడి చేసిన పుని సమీప అడవిలోకి వెళ్లింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ తో ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఫుల్ జోష్లో ఈ సమావేశాలు సాగాయి.
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది. దీంతో సింగరేణికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కోయగూడెం ఉపరితల గనిలో 187 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా 9కోట్ల గ్యాలన్ల నీరు క్వారీలోకి చేరింది. వరుసగా మూడు రోజులు ఇల్లందు టేకులపల్లి […]
Janasena Leader Nagababu Criticizes CM Jagan: జగన్ సర్కారు పై జనసేన విమర్శల దాడిని పెంచుతోంది. నవరత్నాలపై నవసందేహాలంటూ ప్లీనరీ రోజునే వైసీపీని పవన్ టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమ్మ ఒడి తప్పించుకోవడానికే ముద్దుల మావయ్య స్కూళ్లను మూసివేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. స్కూళ్లను మూసివేయడం ద్వారా భావి భారత పౌరుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చివేస్తున్నారని ఆవేదన […]
Telangana Weather Updates: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ విధించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ వర్షాల్లో చేపట్టాల్సిన చర్యల నిమిత్తం సంసిద్ధమయ్యారు. రాష్ట్రంలోని […]
వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల పై నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మొదటి రత్నం: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి, 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవఅధ్యక్షురాలిపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు.