Home / ప్రాంతీయం
Allu Arjun Gets Relief in Court: హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు మరో ఊరట కల్పించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షరతులతో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనల్లో సడలింపు ఇస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు […]
Vijayawada West Bypass Alleviates: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంత సొంత ఊళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ కిటకిటలాడుతుంది. టోల్ గేట్స్ రద్దిగా మారాయి. దీంతో రోడ్డుపై గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ట్రాపిక్ తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారి ట్రాఫిక్ సమస్యలతో పాటు జర్నీ సమయాన్ని తగ్గించింది. హైదరాబాద్ నుంచి […]
YS Abhishek Reddy Died: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, కజిన్ డాక్టర్. వైఎస్ అభిషేక్ రెడ్డి(36) మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వైఎస్ అభిషేక్.. వైఎస్ జగన్‌కు సోదరుడు వరుస అవుతారు. వైఎస్సార్సీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చిన్న వయసులోనే అభిషేక్ మరణించడంతో పార్టీ […]
HC Upset on Special Shows For Movies: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రం టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై దాఖలైన పటిషన్‌పై శుక్రవారం(జనవరి 10న)హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రాలకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రభుత్వం […]
CM Chandrababu Full Speech at Guntur: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అందుకే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య కంపెనీ దగ్గర ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని చంద్రబాబు విమర్శలు చేశారు. మమ్మల్ని నమ్మి 93 శాతం మంది అభ్యర్థులను గెలిపించారని చంద్రబాబు […]
CM Revanth Reddy Comments on Hyderabad Fourth City: హైదరాబాద్‌లో ఫోర్త్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీలోని సీఐఐ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తెలంగాణనే నెంబర్ వన్ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మూసీలో 55 కి.మీ వరకు తాగునీరు అందేలా చూస్తామని […]
Deputy CM Pawan Kalyan in Pitapuram Constituency: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమండ్రి, కాకినాడ రోడ్డు పనులను పరిశీలించారు. తొలుత రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లే రూట్లలో రామస్వామిపేట సమీపంలో ఏడీబీ పనులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పనుల నిర్మాణంపై కలెక్టర్లను ఆరా తీశారు. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రశాంతి, షాన్ మోహన్ పనుల వివరాలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. […]
Telangana Governor Green Signal To Telangana Bhubharathi Bill: చరిత్రాత్మకమైన భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన నేపధ్యంలో, త్వరలో దీనిని అమలుకు రంగం సిద్ధం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణలో మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, దీంతో భూతగాదాలకు చెక్ పడుతుందని తెలిపారు. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి.. గత సర్కారు తెచ్చిన రెవెన్యూ […]
AP Highcourt big shock to ycp leader Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగానే ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును […]
Deputy CM Pawan Kalyan fire on thirupati issue: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో టీటీడీ, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలున్నంత త్వరగా టీటీడీని ప్రక్షాళన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం నిందమోయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలో పర్యటించిన పవన్.. అక్కడి […]