Aadhaar link to Tatkal Tickets: నేటి నుంచే తత్కాల్‌కు ఆధార్ లింక్.. సర్క్యులర్ జారీ చేసిన రైల్వే శాఖ

Railway Department has issued a circular Aadhaar link to Tatkal Tickets: తత్కాల్ టిక్కెట్లకు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనతో తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో పారదర్శకత పెరుగుతుందని, దుర్వినియోగం తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నిబంధన నేటి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది.
తత్కాల్ టిక్కెట్లకు ఆధార్ లింక్:
తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు అక్రమాలను అరికట్టడానికి రైల్వే శాఖ కీలక మార్పును తీసుకొచ్చింది. నేటి నుంచి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయం ద్వారా మధ్యవర్తుల అక్రమాలు తగ్గడంతో పాటు అవసరమైన ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ ఆశిస్తోంది.
మార్పు ఎందుకంటే?
తత్కాల్ టిక్కెట్ల వ్యవస్థ ప్రయాణికులకు అత్యవసర ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గతంలో కొంతమంది దళారులు సాఫ్ట్‌వేర్ల ద్వారా లేదా బల్క్ బుకింగ్‌ల ద్వారా టిక్కెట్లను బ్లాక్ చేసేవారు. ఇలా బ్లాక్ చేసి బయ మార్కెట్లలో అధిక ధరకు విక్రయించేవారు. దీంతో ప్రయాణికులు తత్కాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తత్కాల్ టికెట్ కోసం రైల్వే శాఖ ఆధార్ తప్పనిసరి చేసింది.
ఆధార్ లింకింగ్ ఎలా పని చేస్తుంది?
తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు తమ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికుల ఆధార్ వివరాలు సిస్టంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసిన ఐఆర్‌సీటీసీ అకౌంట్ నుంచి పరిమిత సంఖ్యలో తత్కాల్ టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది బల్క్ బుకింగ్‌లను అరికట్టేందుకు సహాయపడుతుంది. ఆధార్ లింక్ చేయడంతో దళారులు ఐఆర్‌సీటీసీ అకౌంట్లను క్రియేట్ చేసి టిక్కెట్లను బ్లాక్ చేసే అవకాశం తగ్గుతుంది.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు
దళారుల అక్రమాలు తగ్గడంతో పాటు ఎమర్జెన్సీగా ప్రయాణించేందకు సులువుగా ఉంటుంది. ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు సులభంగా లభించే అవకాశం ఉంటుంది. దీంతో బుకింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. అదే విధంగా ప్రయాణికులను గుర్తించేందుకు సులువుగా ఉంటుంది. ఈ కొత్త నిబంధనతో తత్కాల్ టిక్కెట్ల వ్యవస్థ మరింత సమర్థవంతంగా, ప్రయాణికులకు సులువుగా మారే అవకాశం ఉంటుంది.