Imran Khan Comments: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులతో హత్య చేయించడానికి.. ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తనను హత్య చేసేందుకు.. ఉగ్రవాద సంస్థకు భారీగా నగదు అందించినట్లు మీడియాకు వెల్లడించారు.
పాక్ మాజీ ప్రధాని.. తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ Imran Khan వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి. తన హత్య కోసం ప్రత్యర్ధులు ఎదురుచూస్తున్నారని.. ఆయన ఆరోపించారు. ఓ ఉగ్రవాద సంస్థతో హత్య చేయించేందుకు.. ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కుట్ర వెనక.. దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో.. తన హత్యకు ప్రణాళికలు వేశారని తెలిపాడు. గతంలోనూ హత్య చేసేందుకు కుట్ర చేశారని.. అప్పుడు తప్పించుకున్నానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో కుట్ర పన్నిన వారికి ఇందులో భాగస్వామ్యం ఉందని తెలిపాడు. ఈ కుట్రలో ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉందని పాక్ మాజీ ప్రధాని ఆరోపించాడు.
ఘోర పతనం అంచునా పాక్ రూపాయి
ప్రస్తుతం పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ తినడానికి తిండి దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు దేశంలో విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ నెత్తిపై మరో పిడుగు పడింది.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశానికి రూపాయి బిగ్ షాక్ ఇచ్చింది.
ఆ దేశంలో పాక్ రుపాయి భారీ పతనం దిశగా సాగుతుంది. డాలర్‌తో పోలిస్తే అక్కడి రూపాయి రూ.262.6గా నమోదైంది.
1999 తర్వాత ఆ స్థాయికి దిగజారడం ఇదే మెుదటిసారి.
మార్కెట్ల ప్రారంభంలో రూ.265 ఉన్న విలువ.. చివరకు రూ.262.6 వద్ద ఆగింది.
ఐఎంఎఫ్ సూచనతో ద్రవ్యమారకపు రేటుపై పాక్ నిబంధనలను సడలించింది. ఆ తర్వాత రూపాయి విలువ పతనమైంది.
వచ్చే నెలలో ఐఎంఎఫ్..నిధులు విడుదల చేస్తుందని పాక్ ఆశిస్తుంది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. అప్పుల ఊబిలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది.
పాక్ మాజీ ప్రధాని ఆరోపణలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా హత్య ఆరోపణలు చేయడం పాకిస్థాన్ లో సంచలనంగా మారింది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/