Site icon Prime9

Nawaz Sharif: 1999 లాహోర్‌ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది.. పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

Nawaz Sharif

Nawaz Sharif

Nawaz Sharif: మన దాయాది దేశం పాకిస్తాన్‌ ఎప్పుడు అబద్దాలు వల్లె వేస్తోంది తప్ప.. వాస్తవాలు మాత్రం చచ్చినా చెప్పదు. తిమ్మిన బమ్మిన చేయడంలో సిద్దహస్తురాలు. మరి అలాంటి పాక్‌కు మరి ఎందుకో జ్ఞానోదయం కలిగి చేసిన తప్పును ఒప్పకోవడం విశేషం. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న లాహోర్‌ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందన్న చేదు నిజాన్ని పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ బట్టబయలు చేశారు. మరి మియా నవాజ్‌ షరీఫ్‌ లాహోర్‌ డిక్టరేషన్‌ ఎలా ఉల్లంఘించింది .. ఆయన ఇంకా ఏం చెప్పారో మరింత సమాచారం తెలుసుకుందాం.

మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ను ప్రపంచంలోని ఏ దేశం నమ్మదు. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడదు. వెన్నుపోటు పోవడంలో సిద్దహస్తులు… నోరు విప్పితే అన్ని పచ్చి అబద్దాలు వల్లెవేస్తోంది తప్ప నిజాలు మాత్రం పాకిస్తాన్‌ డిక్సనరీలో లేదు. మరి ఎందుకో మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ నోట నుంచి కొన్ని పచ్చి నిజాలు జాలువారాయి. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న చారిత్రాత్మక లాహోర్‌ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందన్న చేదు నిజాన్ని ఆయన అంగీకరించారు. ఇక లాహోర్‌ డిక్లరేషన్‌ విషయానికి వస్తే ఉప్పు.. నిప్పుగా ఉండే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఫిబ్రవరి 21, 1999లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు ఇండియా తరపున అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా సంతకాలు చేశారని సీనియర్‌ షరీఫ్‌ గుర్తు చేశారు.

ముషారఫ్‌ను ఉద్దేశించే..(Nawaz Sharif)

మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ముషారఫ్‌ కార్గిల్‌ యుద్ధం అనే దుస్సాహసానికి దిగారు. తర్వాత యుద్ధంలో ఘెరంగా ఓడిపోయారని చెప్పారు. ఇక పాకిస్తాన్‌ మే 28, 1988లో ఐదు న్యూక్లియర్‌ టెస్టులను ప్రయోగించింది. అటు తర్వాత వాజపేయి సాబ్‌ పాకిస్తాన్‌కు వచ్చి మనతో ఒక ఒప్పందం కుదర్చుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం.. అంతా మన తప్పే అని మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ పీఎంఎల్‌ -ఎన్‌ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. కాగా అధికార పీఎంఎల్‌-ఎన్‌ షరీఫ్‌ను పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నకుంది.

ఇక లాహోర్‌ డిక్లరేషన్‌ విషయానికి వస్తే ఇరు దేశాల మధ్య శాంతి కోసం ఫిబ్రవరి 21, 1999లో ఒప్పందం జరిగింది. ఈ చారిత్రాత్మక సదస్సు ప్రధాన ఉద్దేశం ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడంతో పాటు పీపుల్‌ టు పీపుల్‌ కాంటాక్ట్‌ .. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం చిగురింపచేసేందుకు .. రాకపోకలకు అనుమతించడంతో పాటు వీసా నిబంధనలు సడలించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో పాటు ఇతర ఒప్పందాలు జరిగాయి. అయితే లాహోర్‌ డిక్లరేషన్‌ను పాకిస్తాన్‌ తుంగలో తొక్కింది. వెంటనే పాకిస్తాన్‌ మిలిటరీ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లో దూసుకుపోయింది. దీంతో కార్గిల్‌ వార్‌ మొదలైందని నవాజ్‌ షరీఫ్‌ వివరించారు.

జనరల్‌ ముషారఫ్‌ ఆదేశాలతో రహస్యంగా కార్గిల్‌లోకి చొరబాటుదారులను భారీ ఎత్తున చొప్పించారు. ఇదంతా మార్చి 1999 నుంచి మొదలైంది. పాకిస్తాన్‌ రహస్యంగా చొరబాటుదారులను కార్గిల్‌లో చొప్పిస్తోందని తెలుసుకున్న న్యూఢిల్లీ వెంటనే అప్రమత్తమై పూర్తి స్థాయి యుద్ధానికి తెరతీసింది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కార్గిల్‌ యుద్ధం జరిగింది. చివరికి ఇండియా యుద్ధం గెలిచిందన్నారు నవాజ్‌ షరీఫ్‌.

Exit mobile version