Site icon Prime9

Maruti Dzire Safety Rating: న్యూ జెన్ డిజైర్.. కొనే మందు ఇది గమనించారా..!

Maruti Dzire Safety Rating

Maruti Dzire Safety Rating

Maruti Dzire Safety Rating: గ్లోబల్ ఎన్‌సిఎపిలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన మారుతి సుజుకి ఇండియాకు న్యూ జెన్ డిజైర్ మొదటి కారుగా నిలిచింది. GNCAPలో మారుతి కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం ఇదే మొదటిసారి. మారుతి తన కొత్త డిజైర్ భద్రతపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంది. అందువల్ల కంపెనీ దానిని GNCAPలో టెస్టింగ్ కోసం పంపింది. కంపెనీ అంచనాలకు అనుగుణంగా ఈ మోడల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఇంతకుముందు డిజైర్ పాత మోడల్‌కు GNCAP భద్రత కోసం 3-స్టార్‌లను అందించింది.

భారత్ NCAP, BNCAP క్రాష్-టెస్ట్ రేటింగ్ ప్రోగ్రామ్, GNCAP కోసం టెస్టింగ్ విధానాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. GNCAP భారతదేశంలో ఒక దశాబ్దం నుంచి ఉంది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పోల్చి చూస్తే BNCAP కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉనికిలో ఉంది. దీని దృష్టి భారతదేశంలో విక్రయించే కార్లపై ఎక్కువగా ఉంది. ఫలితంగా లిమిటెడ్ విజిబిలిటీ ఉంటుంది.

అయినప్పటికీ డిజైర్  భద్రతా రేటింగ్ భారతీయ కస్టమర్లకు చాలా ముఖ్యమైనది. ఈ కారు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్ వంటి అనేక అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి అవుతుంది. ఇటీవల సరికొత్త తరం డిజైర్ అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. విదేశాల్లో ఉన్న మోడళ్లను ఇది క్రమంగా భర్తీ చేస్తుంది. అందువల్ల కొత్త డిజైర్‌కి GNCAP 5-స్టార్ రేటింగ్ సుజుకికి చాలా సహాయంగా ఉంటుంది.

న్యూ జెన్ మారుతి డిజైర్ ఫీచర్ల విషయానికి వస్తే..  అప్‌డేట్ చేసిన డిజైర్ దాని అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, హారిజెంటల్ DRLలతో కూడిన స్టైలిష్ LED హెడ్‌లైట్‌లు, మల్టీ హరిజెంటల్ స్లాట్‌లతో కూడిన విస్తృత గ్రిల్,రీడిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లతో ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే దీని సిల్హౌట్ మునుపటి మోడల్‌లాగే ఉంటుంది. ఈ సెడాన్  షోల్డర్ లైన్ ఇప్పుడు మరింత ప్రముఖమైనది. ఇతర ఫీచర్లలో షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, క్రోమ్ స్ట్రిప్‌కు జోడించిన Y- ఆకారపు LED టెయిల్‌లైట్‌లు ఉన్నాయి.

డిజైర్ లోపలి భాగంలో లేత గోధుమరంగు, నలుపు రంగు థీమ్, డ్యాష్‌బోర్డ్‌పై ఫాక్స్ వుడ్ యాక్సెంట్‌లు ఉన్నాయి. ఇది అనలాగ్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్‌లెస్‌తో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెనుక వెంట్‌లతో కూడిన ఎయిర్ కండిషనింగ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందుతుంది.

కొత్త డిజైర్ స్విఫ్ట్ నుండి తీసుకోబడిన 1.2-లీటర్ మూడు-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ యూనిట్ గరిష్టంగా 80bhp పవర్,  112Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో ఉంది. ఇది LXi, VXi, ZXi, ZXi ప్లస్ వేరియంట్లలో లాంచ్ అయింది.

మారుతి సుజుకి మాడిఫైడక్ కాంపాక్ట్ సెడాన్ వెనుక పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), 360-డిగ్రీ కెమెరా (సెగ్మెంట్‌లో మొదటిసారి) వంటి అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. అప్‌డేట్ చేసిన డిజైర్  ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.70 లక్షలు. ఈ కారు హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్‌లతో పోటీపడుతుంది.

Exit mobile version