Site icon Prime9

Imran Khan : నేను ప్లేబాయ్‌ను.. దేవదూతను కాదు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pak Supreme Court

Pak Supreme Court

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, తన ఫోన్ సెక్స్ ఆడియో వైరల్ అయిన తర్వాత మొదటిసారిగా స్పందించారు. తాను గతంలో దేవదూతను కాదని ప్లేబాయ్ నని అంగీకరించారు. రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా గత ఏడాది అవిశ్వాస తీర్మానం ద్వారా తనను తొలగించబడటానికి ముందు వారి చివరి సమావేశంలో తనను “ప్లేబాయ్” అని పిలిచారని కూడా అతను పేర్కొన్నాడు.

ఆగస్టు 2022లో జనరల్ బజ్వాతో జరిగిన సమావేశంలో, నా పార్టీ సభ్యుల ఆడియోలు మరియు వీడియోలు తన వద్ద ఉన్నాయని అతను నాతో చెప్పాడు. నేను ‘ప్లే బాయ్’ అని కూడా గుర్తు చేశాడు. నేను అతనితో చెప్పాను…అవును, నేను గతంలో (ప్లే బాయ్)నునేను దేవదూతను అని ఎప్పుడూ చెప్పుకోలేదని అన్నట్లు ఖాన్ తెలిపారు. లాహోర్‌లోని తన నివాసంలో ఇమ్రాన్ ఖాన్ ‘డర్టీ ఆడియోల’ గురించి మాట్లాడారు. “మురికి ఆడియో మరియు వీడియోల ద్వారా మన యువతకు మనం ఏమి సందేశం ఇస్తున్నాము అంటూ ప్రశ్నించారు. ఖాన్‌కు చెందినదిగా భావిస్తున్న మూడు ఆడియో క్లిప్‌లు లీక్ అయ్యాయి. ఈ ఆడియో క్లిప్‌లు నిజమైనవేనని, రానున్న రోజుల్లో ఖాన్‌కి సంబంధించిన ఇలాంటి వీడియో క్లిప్‌లు బయటకు వచ్చే అవకాశం ఉందని అంతర్గత మంత్రి రాణా సనావుల్లా పేర్కొన్నారు.

అతను జాగ్రత్తగా డబుల్ గేమ్ ఆడుతున్నాడని , షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానిని చేస్తున్నాడని నాకు తెలిసింది. బజ్వా నా వీపుపై కత్తితో పొడిచాడని ఖాన్ అన్నారు.
జనరల్ బజ్వాకు పొడిగింపు మంజూరు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. జనరల్ బజ్వాకు పొడిగింపు మంజూరు చేయడం నా పెద్ద తప్పు. బజ్వా పొడిగింపు పొందిన తర్వాత తన ‘అసలు రూపం చూపించడం ప్రారంభించాడు మరియు చివరికి జవాబుదారీతనం విషయంలో నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశాడని ఇమ్రాన్ ఖాన్ నిందించారు.

Exit mobile version