Home / తాజా వార్తలు
ISRO Marks 100th Mission ISRO GSLV-F15 Successful Launch: ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6.23 నిమిషాలకు ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం జీఎస్ఎల్వీ-ఎఫ్15రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రమోగం విజయవంతం కావడంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2,250 కేజీలు బరువు ఉన్న ఈ శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ సెంటర్ […]
PM Narendra Modi to inaugurate India’s 38th National Games in Dehradun: క్రీడాకారుల కేరింతలు, క్రీడాభిమానుల హర్షధ్వానాలు, వేలాది ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 38వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శనలు, మనసును మైమరిపించే సంగీతం సాగుతుండగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ క్రీడాపోటీలను అధికారికంగా ప్రారంభించారు. గాయకుల పాటలకు […]
India vs England 3rd T20 match England beats India by 26 runs: హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ పడింది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన భారత్.. మూడో టీ20 మ్యాచ్‌లో బోల్తా పడింది. రాజ్‌కోట్ వేదికగా నిరంజన్ షా మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. 172 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు […]
Mauni Amavasya At Maha Kumbh: మహా కుంభమేళాకు భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభ్‌లో అమృత స్నానాలు చేయగా, బుధవారం మౌని అమావాస్య నాడు కనీసం 10 కోట్ల మంది నదీ ప్రాంతాల్లో పుణ్య స్నానాలకు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. అయితే వాహనదారులకు ప్రభుత్వం పలు […]
Horoscope Today in Telugu January 29: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. అలాగే ఈరోజు మౌనీ అమావాస్య. మాఘ కృష్ణ అమావాస్య రోజున.. మౌనీ అమావాస్య అంటారు. సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే జప, తప, నదీ స్నాన కర్మలకు విశేష ఫలం సిద్ధిస్తుందనేది హిందువుల విశ్వాసం. మేషం […]
Thandel Telugu Trailer Out: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘తండేల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విశాఖపట్నం ఈ రోజు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది మూవీ టీం. ఈ కార్యక్రమానికి హీరో నాగచైతన్య, సాయిపల్లవి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ట్రైలర్ విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ లవ్, ఎమోషన్‌తో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య, సాయి […]
Honda ZR-V Hybrid SUV: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండాకు భారతీయులలో ప్రత్యేక హోదా ఉంది. సిటీ, సివిక్, అమేజ్ వంటి సెడాన్లు కంపెనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించడంతో ఇప్పుడు హోండా ఎస్యూవీలలోకి వెళ్లవలసి వచ్చింది. ఇందులో భాగంగా ఎలివేట్ పేరుతో మిడ్ సైజ్ ఎస్ యూవీని రూపొందించి. హోండా తొలినాళ్లలో బాగానే అమ్ముడుపోయినా ప్రస్తుతం దారుణమైన స్థితిలో ఉంది. ఇప్పటికే ఉన్న మోడళ్లు బ్రాండ్‌కు పెద్ద నిరాశ కలిగిస్తున్నాయి. కాబట్టి హోండా ఇప్పుడు […]
Google Pixel 9a Price Leaks: గూగుల్ భారత్‌లో గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లో Google Pixel 9aని పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి అధికారిక సమాచారం రాలేదు. కానీ పిక్సెల్ 9a మార్చి 2025లో మార్కెట్లోకి రావచ్చని టాక్ వినిపిస్తుంది. లాంచ్‌కు ముందు ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. లీక్స్ ప్రకారం పిక్సెల్ 9a బేస్ మోడల్ (128GB) వేరియంట్ ధర […]
Fatima Sana Open Up on Casting Couch: ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌తో డేటింగ్ వార్తలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. కెరీర్ ప్రారంభంలో ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పింది. అయితే అది బాలీవుడ్ కాదు సౌత్ సినిమాల్లో అని చెప్పి షాకిచ్చింది. […]
Google Pixel 8a Big Discount: మీరు అద్భుతమైన ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. మీకు శుభవార్త ఉంది. బాంబ్‌షెల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఉత్తమ సమయం. చాలా మంది వినియోగదారులు గూగుల్ స్మార్ట్ఫోన్ల పట్ల క్రేజీగా ఉన్నారు. ఈ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో వస్తాయి. సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ ఫీచర్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వాటి ధరలు కూడా చాలా ఎక్కువగా […]