Home / తాజా వార్తలు
Baghpat Stage Collapse issue 5 Killed, Over 60 Injured in Laddu Festival: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో లడ్డూ మహోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అలాగే ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యూపీలోని బాగ్ […]
India vs England Third T20 Match: భారత్, ఇంగ్లాండ్ జట్ట మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి […]
PM Narendra Modi said NCC inspired youth towards nation building: ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక వహిస్తోందని, వీరి భాగస్వామ్యం లేకుండా ప్రపంచాభివృద్ధిని ఊహించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్స్‌లో సోమవారంనాడు జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. సరిహద్దు వరకు మీ సేవలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎన్సీసీ కోసం […]
All Set For Nagoba Jatara of Mesrams In Adilabad District: ఆదిమ గిరిజనుల ప్రాచీన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు 8 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించే ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతరకు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిసా, తెలంగాణలోని […]
CM Chandrababu on AP Debts and Niti Aayog Reports: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని సచివాలయంలో నీతిఆయోగ్ నివేదిక మీద సీఎం మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల ఆర్థిక విధ్వంసానికి ఈ నివేదికే నిదర్శనమని చెప్పారు. […]
Home Minister Amit Shah says Naxalism will end by March 2026: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భారీ ఎన్కౌంటర్ అనంతరం ఆ ఘటనపై ఆయన స్పందించారు. ‘భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చివరి శ్వాసకు దగ్గరగా ఉంది. మావోయిస్ట్ విముక్త భారత్ కోసం సాయుధ బలగాలు అత్యంత ధైర్యసాహసాలతో 14 మంది మావోయిస్టులను […]
Horoscope Today in Telugu January 28: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విశేషమైన కృషి చేస్తారు. పెట్టుబడులు కీలకమైన చర్చలు ముఖ్యమైన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించండి. వృషభం – మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. వృత్తి – ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా […]
Sri Satya Comments on Ram Pothineni: బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది శ్రీ సత్య. బిగ్‌బాస్ 7 సీజన్లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె తన అందం, అభినయంతో పాటు, తనదైన ఆటతీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ షో తర్వాత డ్యాన్స్ షోస్, స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. అయితే మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఆ తర్వాత సీరియల్స్ నటించింది. టీవీ సీరియల్స్‌లో అలరించిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్ […]
Samsung Galaxy Z Flip 7: సామ్సంగ్ ఇటీవలే దాని S25 సిరీస్‌ని ప్రారంభించింది. దాని తర్వాత కంపెనీ ఇప్పుడు Galaxy Z Flip 7ని Galaxy Z Flip 6కి అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఈసారి ఫోల్డబుల్‌తో పాటు, చౌకైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఎఫ్ఇ, బుక్-స్టైల్ ఫోల్డబుల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కూడా లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. గత కొన్ని వారాల్లో హ్యాండ్సెట్ గురించిన అనేక వివరాలు ఆన్లైన్లో కనిపించాయి. ఇటీవలి […]
Tata Nexon CNG Dark Edition: టాటా నెక్సాన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో విక్రయానికి అందుబాటులో ఉన్న టాటా మోటార్స్ నెక్సాన్‌ను ఫ్యాక్టరీ సిఎన్జి కిట్‌తో కూడా అందిస్తుంది. దేశీయ వాహన తయారీ సంస్థ టాటా నెక్సాన్ సిఎన్‌జిని సెప్టెంబరు 2024 ప్రారంభంలో రూ. 8.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేయనుంది. ఇప్పుడు మరోసారి టాటా మోటార్స్ టాటా నెక్సాన్ సిఎన్జి డార్క్ […]