సీఎం వైఎస్ జగన్ : సీఎం పుట్టిన రోజు వేడుకల కోసం… వైకాపా క్యాడర్ ఓవరెక్షన్ !
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 50 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమనులంతా
CM Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 50 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమనులంతా ఓ పండుగ లాగా జరుపుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వైకాపా జెండాలు, ఫ్లెక్సీలు ఓ రేంజ్ లో కట్టి జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో సైతం జగన్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతూ ట్రెండింగ్ చేశారు. తమ అభిమాన నాయకుడి కోసం వారు ఆ విధంగా చేయడం పట్ల ఎవరికి అభ్యంతరం లేదు. ప్రతిపక్ష నేతలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ… సినీ , రాజకీయ ప్రముఖులు కూడా జగన్ కు విషెస్ చెప్పారు. అయితే సీఎం జగన్ దృష్టి తమపై పడాలని పలువురు నేతలు చేసే వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వైకాపా జెండాలు కట్టడానికి విద్యుత్ సరఫరాను దాదాపు 2 గంటల పాటు నిలిపివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పట్ల విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… మైదుకూరు పట్టణంలో జగన్ పుట్టిన రోజు కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు పట్టణం అంతటా విద్యుత్ స్తంబాలకు పార్టీ జెండాలు కట్టారు. అక్కడక్కడా బ్యానర్లు కూడా కట్టారు.
అయితే పట్టణంలోని కృష్ణ దేవరాయల్ సర్కిల్లో చుట్టూ ఉన్న విద్యుత్ స్తంభాల మీదుగా రౌండ్ చేయాల్సి వచ్చింది. దీంతో సాయంత్రం 5.35 నిమిషాల నుంచి రాత్రి 7.35 వరకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.దీంతో వ్యాపారులు సైతం గిరాకీ లేక కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదుర్కోవాల్సి వచ్చింది. చూస్తుండిపోవడం తప్ప ఏం చేస్తామంటూ నిట్టూరుస్తూ ఉండిపోయారు. ఈ మేరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపేయటంపై ఏఈ రామభద్రయ్యను ఓ ప్రముఖ మీడియా ప్రశ్నించగా… అబ్బే అదేం లేదు. చిన్న ప్రాబ్లం.. వస్తుందిలే అంటూ పేర్కొనడం గమనార్హం. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలో మైదుకూరు ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలను అంబరాన్నంటేలా చేయాలనుకొని ఈ విధంగా కరెంట్ ఆపి మరి వైసీపీ జెండాలు, బ్యానర్లను కట్టారని స్థానికులు చెబుతున్నారు.