Border-Gavaskar Trophy series: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. కాగా, ఈసారి రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తానని, కఠినమైన పని చేయడం చిన్నపటి నుంచి అలవాటు అని, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవడం సమస్య కాదు అని, దీన్ని ఒక కొత్త ఛాలెంజ్‌గా భావిస్తానని బుమ్రా పేర్కొన్నారు. చాలా తక్కువ మంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడారని, కెప్టెన్లు కూడా తక్కువే అని, భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు.