IND Vs AUS 4th Test Day3: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఆస్ట్రేలియా ఇచ్చిన భారీ టార్గెట్ ను టీమిండియా బ్యాటర్లు ధీటుగానే ఎదుర్కొంటున్నారు.
కెఫ్టెన్ రోహిత్ శర్మ- శుభమన్ గిల్ కలిసి అర్థశతక భాగ స్వామ్యం నెలకొల్పారు. అయితే అనూహ్యంగా ఈ జోడిని ఆసీస్ బౌలర్ కునెమెన్ విడదీశాడు.
భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ లబుషేన్ కి క్యాచ్ ఇవ్వడంతో వెనుదిరగక తప్పలేదు.
దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కు 74 పరుగులు చేసింది. మరో వైపు టీమిండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ హాప్ సెంచరీ సాధించాడు.
ఇది అతని కెరీర్ లో 5 వ అర్థశతకం. కెఫ్టెన్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నాడు.
లంచ్ బ్రేక్ కు(IND Vs AUS 4th Test Day3)
నాల్గో టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 129 పరుగులు వద్ద కొనసాగుతోంది.
క్రీజులో శుభమన్ గిల్ (65*), పుజారా (22*) ఉన్నారు. మొదటి సెషన్ లో భారత్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది.
అంతకుముందు ఆసీస్ (Australia) తన మొదటి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆసీస్ బ్యాటర్00 ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో పాటు మర్ఫీ (41),
లయన్ (34), స్మిత్ (38), ట్రావిస్ హెడ్ (32) ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ (6/91) తో అదరగొట్టాడు. షమీ 2.. జడేజా, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఫైనల్‌కు చేరుకోవాలంటే
తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరించిన అహ్మదాబాద్ పిచ్ మూడో రోజు నుంచి స్పిన్‌కు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో భారత్ కాస్త కలవరపడుతోంది.
మరోవైపు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా శ్రీలంక దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో..
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకోవాలంటే రోహిత్ సేనకు నాల్గో టెస్టు మ్యాచ్ లో విజయం తప్పనిసరి కానుంది.