Site icon Prime9

Ram Charan: RC16పై బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన బుచ్చిబాబు – ఆ క్షణం వచ్చేసింది..

#RC16 Shooting Starts: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించని మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషనల్‌ పనులను కూడా జరుపుకుంటుంది. దీని తర్వాత చరణ్‌ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. #RC16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో మూవీ ప్రకటన ఇచ్చారు. ఇప్పటికే పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్ ఎప్పుడెప్పుడా మెగా ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులను ఖుషి చేసే ఓ అప్‌డేట్‌ వదిలాడు బుచ్చిబాబు. తన ఎక్స్‌లో ఓ సర్‌ప్రైజింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. చేతిలో స్క్రిప్ట్‌ పేపర్లతో గుడిలో కనిపించాడు.

ఈ ఫోటోను షేర్‌ చేస్తూ… “బిగ్‌ డే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం.. మైసూరులోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ప్రారంభమైంది. మీ ఆశీస్సులు కూడా కావాలి” అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ చూస్తుంటే RC16 టైం వచ్చేసింది అని అర్థమైపోతుంది. ఈ మూవీ తొలి షెడ్యూల్‌ని మైసూర్‌ ప్లాన్‌ చేశారట. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో మూడు రోజులు పాటు షూటింగ్‌ జరగనుందని సమాచారం. ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అయితే ఈ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌ ఉంటారా. లేదా? అనే క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారు. ఆయన పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ‘కుమ్మేయ్ అన్న, ఆల్‌ ద బెస్ట్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా దర్శకుడి బుచ్చిబాబుకు ఇది రెండో చిత్రం. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడైన బుచ్చిబాబు ‘ఉప్పెన’ చిత్రంతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. తొలి ప్రయత్నంలో డైరెక్టర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్ల క్షబ్‌లో చేరింది. హిట్‌ డైరెక్టర్‌గా ముద్ర వేసుకన్న ఆయన తన రెండో సినిమాకే ఏకంగా గ్లోబల్‌ స్టార్‌ని మెప్పించారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో చరణ్ పాత్ర పవర్ఫుల్‌గా ఉండనుంది. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే జగపతి బాబులు కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

Exit mobile version