Ind Vs Aus Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 262 పరుగలకు ఆలౌట్ అయింది. ఓ దశలో కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. అశ్విన్, అక్షర్ రాణించడంతో.. 262 పరుగులు చేయగలిగింది. మెుదట భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలింగ్ లో నాథన్ లయన్ 5 వికెట్లు తీశాడు. ఇద మెదటి ఇన్సింగ్స్ లో ఆసీస్ ఒక పరుగు ఆధిక్యం సాధించింది. భారత్ బ్యాటింగ్ లో అక్షర్ పటేల్ ఒక్కడే.. 74 పరుగులతో రాణించాడు.
మెుదటి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లోను విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నయా వాల్.. చెతేశ్వర్ పూజారా డకౌట్ గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యారు కూడా నాలుగు పరుగులు చేసి మాత్రమే ఔటయ్యాడు. రోహిత్ శర్మ 32 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 17 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ 44 పరుగులు, శ్రేయస్ అయ్యార్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లు విజృంభిస్తున్న వేళ.. అక్షర్ ఒంటరిగా పోరాటం చేస్తూ.. 74 పరుగులు సాధించాడు. అక్షర్ కు తోడుగా.. అశ్విన్ 37 పరుగులు సాధించి భారత్ కు మంచి స్కోర్ అందించారు. చివర్లో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే ఔటయ్యారు. దీంతో ఆసీస్ కు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది.
ఆసీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను బ్యాట్‌తో ఆదుకున్న ఆశ్విన్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 5000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న టీమిండియాను అశ్విన్ 37 పరుగులతో ఆదుకున్నాడు. అశ్విన్, అక్షర్ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన వందకు పైగా పరుగులు జోడించి భారత్ కు మంచి స్కోర్ అందించారు. రెండో టెస్టులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆపద్భాంధవుడయ్యాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన బ్యాటింగ్ బాధ్యతను భూజాన వేసుకున్నాడు. 115 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. కెరీర్ మొదట్లో కేవలం బౌలింగ్ కే అక్షర్ పటేల్ పరిమితమయ్యాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా మారాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మాత్రం అక్షర్ పటేల్‌లో పూర్తిస్థాయి బ్యాటర్ కనిపిస్తున్నాడు. బ్యాటర్లు విఫలమైన చోట రాణిస్తూ.. టీమిండియాను ఆదుకుంటున్నాడు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో టీమిండియా స్పిన్నర్లు.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డులు సృష్టించారు. ఆసీస్ తో జరిగిన టెస్టుల్లో.. వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అలాగే.. మెుత్తం టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. దీంతో అశ్విన్ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత కొనసాగుతున్నాడు. అనిల్ కుంబ్లే.. ఆస్ట్రేలియాపై 111 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారేను అశ్విన్ డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్‌పై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షేన్ వార్న్ నిలిచాడు. ఒకే జట్టుపై 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో మెుదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
రెండో టెస్టులో రవీంద్ర జడేజా మరో రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా మరో మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఖవాజాను ఔట్ చేసిన జడ్డూ.. ఈ ఫీట్ ను నమోదు చేశాడు. టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా జడేజా ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2500 పరుగులతో పాటు.. 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.