Delhi Rains: ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంశుక్రవారం తెల్లవారుజామునుంచి ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైంది.ఇటీవలి వేడి నుండి ఢిల్లీవాసులకు చాలా ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.
అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.కన్నాట్ ప్లేస్ సమీపంలోని మింటో రోడ్ అండర్‌పాస్ వద్ద వాహనాలు మునిగిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. వర్షం కారణంగా పలువురు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సామాజిక మాధ్యమం X లో ప్రతి గదిలోను నీరు చేరడంతో తివాచీలు, ఫర్నీచర్, పాడయినట్లు చెప్పారు. డ్రయినేజీలు అన్నీ మూసుకుపోయాయి, కాబట్టి నీరు వెళ్ళడానికి స్థలం లేదు. విద్యుదాఘాతానికి గురవుతారనే భయంతో ప్రజలు ఉదయం 6 గంటల నుండి విద్యుత్తును నిలిపివేసారని చెప్పారు. రోడ్లపై నుంచి నీటిని తోడటంలో తాను సకాలంలో పార్లమెంటుకు చేరుకోగలిగానని థరూర్ చెప్పారు.లోధీ ఎస్టేట్ ఏరియాలోని తన బంగ్లా వెలుపల ఉన్న రోడ్డు జలమయం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌కు ఇబ్బందిపడ్డారు. యాదవ్ సిబ్బంది అతనిని భుజాలపై ఎత్తుకుని తన వాహనంపైకి తీసుకువెళుతున్నట్లు వీడియో ఒకటి వెలుగు చూసింది. తన బంగ్లా మొత్తం జలమయమైందని యాదవ్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఫ్లోరింగ్ పూర్తి చేశామని తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు.తాను తెల్లవారు జామున నాలుగు గంటలనుంచి మున్సిపల్ అధికారులతో మాటలాడుతున్నానని పంపు తెచ్చి నీటిని తోడమని చెప్పానని అన్నారు. ఢిల్లీ మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది. ఇటీవల ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో నిరాహార దీక్ష చేసిన అతిషి నివాసం వెలుపల వరద నీరు పోటెత్తిన దృశ్యాలు కనిపించాయి.