Site icon Prime9

Maruti Swift Hybrid: హైబ్రిడ్ స్విఫ్ట్ వచ్చోసిందోచ్.. అద్భుతమైన మైలేజ్.. ఫీచర్స్ అదుర్స్..!

Maruti Swift Hybrid

Maruti Swift Hybrid

Maruti Swift Hybrid: భారతదేశంలో మారుతి హైబ్రిడ్ టెక్నాలజీతో తన స్విఫ్ట్ కారులో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయడానికి యోచిస్తోంది. ఈ కారును ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించగా.. భారత్‌లో ఈ కారు టెస్టింగ్ జరుగుతున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కారు లాంచ్ త్వరలో జరగనుంది. ఈ కారు గురించిన వివరణాత్మక సమాచారాన్ని చూడండి.

మారుతీ తన నాల్గవ తరం స్విఫ్ట్‌ను కొన్ని నెలల క్రితం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కారు ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారు. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో కూడా ఈ కారు మంచి విక్రయాలను పొందుతోంది.

ఈ 4వ తరం అప్‌డేట్‌లో మారుతి ఈ కారును 1.2 లీటర్ Z12E పెట్రోల్ ఇంజన్‌తో ఉంటుంది. మునుపటి 4-సిలిండర్ K సిరీస్ ఇంజిన్‌కు బదులుగా ఈ కారు 3-సిలిండర్ ఇంజిన్‌గా అభివృద్ధి చేసింది. ఈ సందర్భంలో ఈ కారు బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో త్వరలో మార్కెట్లోకి రానుంది. మారుతి కంపెనీ ఈ కారును బెంగళూరు ప్రాంతంలో పరీక్షిస్తున్నట్లు మాకు సమాచారం అందింది.

బెంగళూరులో ఎలాంటి కవర్లు లేకుండా కారును పరీక్షిస్తున్నారు. ఈ కారు వివిధ కొత్త టెక్నాలజీలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా స్టార్ట్/స్టాప్ ఐడియల్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందించవచ్చని భావిస్తున్నారు.

ఈ కారు మైలేజ్ గురించి అధికారిక సమాచారం ఇంకా బయటకు రానప్పటికీ సమాచారం ప్రకారం లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చేలా ఈ కారును అభివృద్ధి చేశారు. ఈ కారు విక్రయం ప్రారంభమైతే దాని అమ్మకాలు భారతదేశంలో విప్లవాత్మకంగా మారుతాయని ఆశించవచ్చు.

అంతర్జాతీయ వేదికపై సుజుకి తన స్విఫ్ట్ కారును 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ సెటప్‌తో ప్రదర్శించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్,  CVTతో రెండు విభిన్న డ్రైవ్ ఎంపికలతో అందించారు. ఫ్రంట్-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఉంటుంది.

ప్రస్తుతం బెంగుళూరులో పరీక్షిస్తున్న కారును అందులో అమర్చిన అటాస్ టెక్నాలజీని కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఇందులో అమర్చిన అటాస్ టెక్నాలజీ భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు ఎలా పని చేస్తుందో పరీక్షించేందుకు మారుతీ ఈ కారును పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

మారుతి ప్రస్తుతం ఇ-విటారా కారును భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నందున, ఇందులో కూడా అడాస్ టెక్నాలజీని పొందుపరచబడుతుందనే అంచనాలు ఉన్నాయి. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారు అరంగేట్రం చేయనుంది. ఇది మార్చి 2015 నాటికి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version