Site icon Prime9

Vivo Y300 5G: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. మనసుదోచేస్తున్న ఫీచర్స్.. ధర ఎంతంటే..?

Vivo Y300 5G

Vivo Y300 5G

Vivo Y300 5G: భారతదేశంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన కొత్త మొబైల్‌ను విడుదల చేయనుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అదే Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్‌. దీనిని కేవలం రూ. 21,999కి విడుదల చేసింది. అలానే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దీన్ని బాగా పాపులర్ చేసే కొన్ని ప్రత్యేక ఫీచర్లను దీనిలో అందించారు. దీనివల్ల Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత పోటీతత్వ మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. కొన్ని నెలలుగా అధునాతన ఫీచర్లతో అనేక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్నాయి.

Vivo Y300 Price
ఈ స్మార్ట్‌ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల స్మార్ట్‌ఫోన్ ధర రూ. 21999 ప్రారంభ ధరతో వస్తుంది. అలానే దాని 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ వరుసగా రూ.23999 ధర ట్యాగ్‌తో వస్తుంది.

ప్రస్తుతం ఈ Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది. సేల్  26 నవంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. అలానే Vivo ప్రీ-ఆర్డర్‌ల కోసం రూ.2000 క్యాష్‌బ్యాక్‌తో పాటు సులభమైన EMI లావాదేవీలపై రూ.1000 తగ్గింపును అందిస్తోంది.

Vivo Y300 Specifications
Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్. 1,800 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్-కెమెరా సెటప్‌లో సోనీ IMX882 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను కూడా పొందింది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో 8GB LPDDR4X RAM, 256GB వరకు స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇది పనితీరు సామర్థ్యాన్ని అందిస్తుంది. Vivo Y300 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లను కేవలం 15 నిమిషాల్లో 45 వాతం వరకు ఛార్జ్ చేయవచ్చని Vivo పేర్కొంది. ఇది Android 15 ఆధారిత Funtouch OS 14 పై రన్ అవుతుంది.

Exit mobile version