Site icon Prime9

AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై అలాంటి వార్తలు – బాధగా ఉందన్న తనయుడు అమీన్‌

AR Rahman Son Ameen Reacts On Rumours of Father: ఆస్కార్‌ అవార్డు గ్రహిత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన భార్య సైరా బానుతో విడాకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ నిలిచింది. మరికొన్ని రోజుల్లో తమ వివాహక బంధాన్ని ముఫ్పై ఏళ్లు నిండనున్న క్రమంలో అనూహ్యంగా విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాక్‌ ఇచ్చారు. మొదట ఆయన సైరా బాను ఈ ప్రకటన చేయగా.. ఆ తర్వాత ఏఆర్‌ రెహమాన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ భార్యతో విడిపోతున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఆయన విడాకుల ప్రకటన అనంతరం ఏఆర్ రెహమాన్‌పై రకరకాల పుకార్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో తన తండ్రిపై వస్తున్న వార్తలపై రెహమాన్‌ తనయుడు అమీన్‌ స్పందించాడు. తన తండ్రి గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు అమీన్‌ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ షేర్‌ చేశాడు. “మా నాన్న ఒక లెజెండ్‌.. వృత్తిపరంగా ఆయన అందిస్తున్న అద్భుతమైన సేవల వల్ల మాత్రమే కాదు. ఎన్నో ఏళ్లు నుంచి ఆయన పొందుతున్న ప్రేమాభిమానులు, విలువలు, గౌరవం వల్ల కూడా. అలాంటి ఆయనపై అసత్యా ప్రచారం, నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది.

ఒక వ్యక్తి జీవితంపై, లెగసి గురించి మాట్లాడేటప్పుడు నిజమేంటో తెలుసుకోండి. దయచేసిన ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం ఆపండి. మా నాన్నపై వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదు. ఆయనకు ఉన్న డిగ్నిటిని, అందరిలో ఆయనకు ఉన్న గౌరవాన్ని అలాగు ఉండనివ్వండి” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. కాగా ఏఆర్‌ రెహమాన్‌ విడాకుల ప్రకటన ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆయన బ్రందంలో పని అసిస్టెంట్‌ లేడీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మోహినిదే అనే అమ్మాయి కూడా తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఇద్దరు గంట వ్యవధిలోనే ఈప్రకటన చేయడంతో ఏఆర్ రెహమాన్‌ విడాకులకు, అసిస్టెంట్‌ డైవోర్స్‌కి ఏమైన కనెక్షన్‌ ఉందా? అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ వార్తలు ఏఆర్‌ రెహమాన్‌ భార్య సైరా బాను తరపు న్యాయవాది ఖండించారు. అసలు మోహినిదే విడాకులకు, ఏఆర్‌ రెహమాన్‌ విడాకులకు అసలు సంబంధమే లేదని, అవి రెండు యాధృచ్చికంగా జరిగినవే అని స్పష్టం చేశారు. ఏఆర్‌ రెహమాన్‌, సైరా బాను విడాకులు వేరే కారణం ఉందని ఆమె మీడియాతో చెప్పారు.

Exit mobile version