Update on Pushpa 3: మరో రెండు రోజుల్లో ‘పుష్ప 2’ థియేటర్లో సందడి చేయనుంది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 ఉంటుందా? లేదా అనే చర్చ మొదలైంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ ఈ చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సౌండ్ ఇంజరీక్‌గా పనిచేసిన రసూల్ పొకుట్టి షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
కాగా ముందు నుంచి పుష్ప 2కి కొనసాగింపుగా పార్ట్ 3 కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. గతంలో బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో పష్ప 1 స్క్రీనింగ్ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉండోచ్చు అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అప్పుడే పుష్ప 3 ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో సౌండ్ ఇంజనీర్ చేసిన పోస్ట్‌తో అందరికి క్లారిటీ వచ్చేసింది. పార్ట్ 3 కూడా ఉందని స్పష్టం అయ్యింది. పుష్ప 2 పూర్తై రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో సౌండ్ ఇంజనీర్ రసూల్ పొకుట్టి తన టీంతో కలిసి ఓ ఫోటో షేర్ చేశారు. దాని వెనకాల ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ అని ఉంది. ఇది చూసి అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. థియేటర్లో పార్ట్ 2 చివరిలో మూడో భాగంపై క్లారిటీ ఇవ్వనున్నారు.
అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సీన్స్ కూడా చూపించనున్నారట. కాబట్టి పుష్ప 3 కూడా ఉంటుందనేది కన్‌ఫాం అయిపోయింది. కానీ ఈ సినిమా రావడానికి మాత్రం కాస్తా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పట్లో అయితే పార్ట్ 3 ఉండకపోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సుకుమార్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ హీరో మరో మూడేళ్లు ఇస్తే పార్ట్ 3 కూడా చేస్తానని అన్నారు. చూస్తుంటే పార్ట్ 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి మరో మూడేళ్లు త్రివిక్రమ్‌కే తన సమయంలో కెటాయిస్తాడు. ఈ గ్యాప్ సుకుమార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్ 3 రావడానికి మరో ఐదేళ్లు అయినా పడుతుందనే అంచనాలు ఉన్నాయి.